మూడో విడత రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులకు శుభవార్త చెప్పారు. ఆగస్ట్ 15న మూడో విడత రుణమాఫీ చేస్తామని ఈరోజు తెలిపారు. వైరాలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నుంచే రుణ మాఫీ జరుగనుంది.. ఇది రైతుల అదృష్టమని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రతిపక్షాల నాయకులు అంతా కూడా భ్రమల్లో ఉండి పోయారని ఆరోపించారు.