మా ప్రెసిడెంట్ మంచు విష్ణుకు దొంగలు ఝలక్ ఇచ్చారు. ఫిల్మ్ నగర్ లో ఉన్న మా ఆఫీస్ లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు తెలుస్తోంది. వాటి విలువ సుమారు రూ. 5లక్షల ఉంటుందని అంచనా.. ఈ చోరీపై విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీనునే ఈ చోరీకి పాల్పడి ఉంటాడని, అతను ఈ చోరీ జరిగినప్పటినుంచి కనిపించడంలేదని విష్ణు మేనేజర్ సంజయ్ ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణచేపట్టారు. మరి ఈ విషయమై మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి.