గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వేస్టేషన్‌లో సోమవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొందరు ప్రయాణికులపై దాడి చేసి రూ.89 లక్షల సొత్తు ఎత్తుకుపోయారు. దుర్గి మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైల్వేస్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫారంలో చెన్నై వెళ్లేందుకు ఎస్-6 బోగీ ఆగే ప్రదేశంలో రైలు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అదే సమయంలో పక్కనే ఉన్న రైల్వే ఖాళీ స్థలం నుంచి ఆరుగురు వ్యక్తులు రైలు కోసం వేచి చూస్తున్న ముగ్గురు ప్రయాణికుల…
రాజేంద్ర నగర్‌లోని కాటేదాన్ లో దోపిడీ దొంగల గ్యాంగ్ హల్ హల్ సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ కర్నూల్ రోడ్డు వద్ద యాసిన్ అనే ఆటో డ్రైవర్‌కు తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు లోనై యాసిన్ ఆటోను విడిచిపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో యాసిన్ వెంటబడ్డ దొంగల ముఠా అతనిపై దాడి చేసి రూ.3200లతో పాటు అతని మొబైల్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు యాసిన్ వెంటనే మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు…
హన్మకొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నక్కలగుట్ట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దగ్గర సోమవారం మధ్యాహ్నం ఘరానా లూటీ జరిగింది. పట్టపగలే సినీఫక్కీలో ఓ కారు అద్దాలు పగులకొట్టి దొంగలు రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే… జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరుపతి, ఆయన కుమారుడు సాయి గణేష్… బ్యాంకులో డబ్బులు డ్రా చేసి కారులో పెట్టారు. డ్రా చేసిన తర్వాత సంతకం కోసం మళ్లీ బ్యాంకుకు వెళ్లి తిరిగి వచ్చేలోపే… డబ్బులు ఎత్తుకెళ్లారని బాధితులు…