రాజేంద్ర నగర్‌లోని కాటేదాన్ లో దోపిడీ దొంగల గ్యాంగ్ హల్ హల్ సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ కర్నూల్ రోడ్డు వద్ద యాసిన్ అనే ఆటో డ్రైవర్‌కు తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు లోనై యాసిన్ ఆటోను విడిచిపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో యాసిన్ వెంటబడ్డ దొంగల ముఠా అతనిపై దాడి చేసి రూ.3200లతో పాటు అతని మొబైల్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు.
దీంతో బాధితుడు యాసిన్ వెంటనే మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోటార్ సైకిల్‌పై ముగ్గురు వచ్చి తుపాకీతో బెదిరించి, దాడి చేసి తన దగ్గరున్న డబ్బులు లాకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే వారు మొత్తం ఐదుగురు ఉన్నట్లు బాధితుడు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీస్తున్నారు.