పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ మారణహోమానికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ టీఆర్ఎఫ్ ను ‘విదేశీ ఉగ్రవాద సంస్థ’ (FTO), ప్రత్యేకంగా నియమించబడిన ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ (SDGT)గా ప్రకటించింది. కాశ్మీర్ రెసిస్టెన్స్ అని కూడా పిలువబడే రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా భావిస్తున్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ భారత్, పాశ్చాత్య దేశాలలో దాడులకు…
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగించింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాని ఫ్రంట్ ఆర్గనైజేషన్ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ఈ దాడి చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దాడి వెు పాక్ హస్తం ఉందనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
కశ్మీర్ భూమిపై మరోసారి భారతీయుల రక్తం చిందింది. సెలవుల్లో ఆహ్లాదంగా గడుపుదామని పహల్గామ్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృత్యుఒడికి చేరుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంటల్లో భర్త కాటికి, భార్య సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటివరకు కాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా దీనిని పరిగణిస్తున్నారు. ఇందులో 28 మంది మరణించినట్లు సమాచారం. అయితే.. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది.…
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ జమ్మూ కాశ్మీర్ లో టార్గెటెడ్ కిల్లింగ్స్ పాల్పడుతూ.. హైబ్రీడ్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది. కాశ్మీర్ విముక్తి కోసం అంటూ లష్కర్ తరపున పనిచేస్తోంది. గతంలో చాలా సార్లు నాన్ లోకల్స్, వలస కూలీలు, హిందువులు, భారతదేశానికి మద్దతు తెలిపే ముస్లింలపై దాడులకు తెగబడింది.
Centre bans TRF: కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని మళ్లీ ప్రారంభించాలని చూస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’(టీఆర్ఎఫ్)పై కేంద్రం నిషేధం విధింంచింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తూ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతోంది. అమాయక పౌరులను, హిందువులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలను, కాశ్మీర్ పండిట్లను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది.
Encounter underway in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం తెల్లవారుజామున ప్రారంభం అయిన ఈ ఎన్ కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో జమ్మూకాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లా వాటర్ హైల్ ప్రాంతాన్ని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. లష్కరే తోయిబా/ ది రెసిస్టెంట్ ఫ్రంట్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు…