Suhana Khan: బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానాకు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. మొన్నటి వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సుహానా త్వరలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు.
చిత్ర పరిశ్రమ అన్నాకా నెపోటిజం సాధారణమే.. ఒక స్టార్ హీరో ను పట్టుకొని వారి కొడుకులు.. మనవాళ్లు , మనవరాళ్లు వారి పిల్లలు ఇలా ఒకరి తరువాత ఒకరు వస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ తండ్రి, తాతల పేర్లు చెప్పుకొని వచ్చినా వారి గుర్తింపు వారు సంపాదించుకోకపోతే వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. అయితే ఈ నెపోటిజం బాలీవుడ్ లో ఎక్కువగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఖాన్ లు, బచ్చన్ లు, కపూర్ లు,…