సినిమా పైరసీ కేసుల్లో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి కస్టడీ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే రవిని విచారించేందుకు కోర్టు కేటాయించిన సమయం సరిపోదని పేర్కొంటూ, పోలీసులు తాజాగా రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. రవిపై నమోదైన మూడు కేసుల్లో ఒక్కో కేసుకు ఒక రోజు చొప్పున మొత్తం మూడు రోజులు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ కొద్దిపాటి సమయం లోతుగా విచారణ చేయడానికి ఏ మాత్రం సరిపోదని పోలీసులు…