భారీ భూప్రకంపనలతో బ్యాంకాక్, మయన్మార్ వణికిపోయాయి. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కూలిపోయాయి. అయితే ఈ ఘటనలో భారీగానే ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.