TG Viswaprasad:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్. వివేక్ కూచిభోట్ల నిర్మించారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించాడు.
నాలుగేళ్ళ క్రితం మేనమామ వెంకటేశ్ - మేనల్లుడు నాగచైతన్య కాంబినేషన్ లో 'వెంకీమామ' సినిమా తీసిన నిర్మాత టి.జి. విశ్వప్రసాదే... ఇప్పుడు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ తో 'బ్రో' మూవీ నిర్మిస్తుండటం విశేషం.
పంజా బ్రదర్స్ సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నటించిన రెండు సినిమాలు ఒకే నెలలో విడుదల కాబోతున్నాయి. రెండేళ్ళ క్రితం కూడా వీరిద్దరి సినిమాలు ఒకే నెలలో వారం గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి మే నెలలో రెండు సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి. గోపీచంద్ మూవీ 'రామబాణం' మే 5న, సిద్ధార్థ్ నటించిన 'టక్కర్' మే 26న రిలీజ్ అవుతున్నాయి.