People Media Factory: ఒకే నెలలో రెండు సినిమాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Takkar: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వేగం పెంచింది. డైరెక్ట్ గా సినిమాలను నిర్మించడమే కాకుండా అదర్ లాంగ్వేజ్ మూవీస్ ను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే సిద్ధార్థ్ నటించిన తమిళ చిత్రం ‘టక్కర్’ను తెలుగులో అభిషేక్ అగర్వాల్ తో కలిసి విడుదల చేయబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి. జి. విశ్వప్రసాద్ నిర్మించిన ‘రామబాణం’ మే 5న వస్తుంటే, డబ్బింగ్ మూవీ ‘టక్కర్’ మే 26న రిలీజ్ కాబోతోంది. అంటే ఈ సంస్థ నుండి రెండు సినిమాలు ఒకే నెలలో వస్తున్నట్టు. నిజానికి ఇలాంటి రేర్ ఫీట్ ఈ యేడాది ప్రారంభంలో మైత్రీ మూవీ మేకర్స్ చేసింది. ఆ సంస్థ నిర్మించిన ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’ చిత్రాలు ఒక్క రోజు తేడాతో జనం ముందుకు వచ్చాయి. అలానే గత యేడాది సురేశ్ ప్రొడక్షన్ సంస్థ నుండి కూడా రెండు సినిమాలు వారం గ్యాప్ తో విడుదల అయ్యాయి.
ఇక ‘టక్కర్’ విషయానికే వస్తే… ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. ఈ తమిళ సినిమా మూడేళ్ళ క్రితం నాటిది. షూటింగ్ పూర్తయినా, కరోనా దెబ్బకు అది జనం ముందుకు రాలేదు. ‘మజిలీ’ మూవీ తర్వాత దివ్యాంశ కౌశిక్ తమిళంలో మొదట సైన్ చేసింది ఈ సినిమాకే. బట్ … దీని విడుదలలో జాప్యం జరగడంతో ఆమె సెకండ్ తమిళ మూవీ ‘మైఖేల్’ ముందుగా జనం ముందుకు వచ్చింది. అయితే…. ఆమె నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘మైఖేల్’ చిత్రాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దాంతో దివ్యాంశ ఆశలన్నీ ఇప్పుడు ‘టక్కర్’ మీదనే పెట్టుకుంది. అలానే సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ‘మహా సముద్రం’లో నటించాడు. భారీ అంచనాలతో 2021లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టింది. ఇక ‘టక్కర్’ దర్శకుడు కార్తీక్ జి. క్రిష్ గతంలో ఎ. కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ తో ‘కప్పల్’ మూవీ తీశాడు. అది తెలుగులో ‘పాండవుల్లో ఒకడు’ పేరుతో డబ్ అయ్యింది కానీ జనాలను మెప్పించలేకపోయింది. ఆ తర్వాత సిద్ధార్థ్ తో ‘సైతాన్ కా బచ్చా’ అనే సినిమా మొదలెట్టాడు. అది ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. ఆ రకంగా ఇటు హీరో సిద్ధార్థ్ కు, హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ కు, డైరెక్టర్ కార్తీక్ జి క్రిష్ కు ‘టక్కర్’ అనేది ఓ లిట్మస్ టెస్ట్ లాంటిది. మరి తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్స్ దీనిని రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!