KTR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, మాజీ మంత్రి, సిద్ధిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు హరీష్ రావుతో సమావేశం అయినట్లు తెలుస్తుంది.
కాంగ్రెస్ ఏడాది పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఆరు అబద్ధాలు-66 మోసాలు అంటూ బీజేపీ ఛార్జ్‌షీట్‌ను విడుదల చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని .. హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు.. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అనేక ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధ్యం అయ్యిందన్నారు.
రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని.. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదన్నారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతుభరోసాపై కేబినెట్ సబ్‌కమిటీ వేశామని.. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని తెలిపారు.
తెలంగాణ బీజేపీ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో ఎలా అమలు జరుగుతున్నాయనే దానిపై ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని.. సోనియా పుట్టిన రోజున రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. ఇచ్చిన ఏ గ్యారంటీని కూడా అమలు చెయ్యలేదని విమర్శించారు. ఏడాదిలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి అంటూ ప్రశ్నలు గుప్పించారు. బెదిరింపులు.. తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు.. అక్రమ కేసులు తప్ప కాంగ్రెస్ సాధించింది లేదన్నారు.
ఈమధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేరళలో, జార్ఖండ్ మంచి మెజారిటీ... మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. కేరళ వయనాడ్‌లో అత్యధిక మెజారిటీతో ప్రియాంక గాంధీ గెలిచారన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ అధిష్టానం ఎక్కడ పోగొట్టుకున్నామో... అక్కడే వెదుక్కునే ప్రయత్నంలో ఉందా? అంటే... ఎక్కడ పోగొట్టుకున్నారో... నిజంగా పార్టీ పెద్దలకు తెలిసి వచ్చిందా? లేక తెలిసిందని అనుకుంటున్నారా? ప్రత్యేకించి ఓ వర్గం ఓటర్లు తమకు ఎందుకు పూర్తిగా దూరం అయ్యారో కనుక్కున్నారా? ఏ విషయంలో బీఆర్‌ఎస్ పెద్దలకు జ్ఞానోదయం అయింది? ఇప్పుడు ఏ రూపంలో ప్యాచ్ వర్క్ మొదలు పెట్టారు?
తెలంగాణలో బీజేపీ ప్రస్తావన లేకుండా మిగతా పార్టీలు పొలిటికల్ స్టేట్‌మెంట్ ఇవ్వలేని పరిస్థి వచ్చిందా? మీతో దోస్తీ అంటే... మీతోనే దోస్తీ అంటూ... కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరస్పరం విమర్శించుకుంటూ... బీజేపీ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాయా? తెలంగాణ కమలనాథులు దీన్ని తమ బలంగా ఫీలవుతున్నారా? కాషాయం కేంద్రంగా తెలంగాణ రాజకీయం ఎలా టర్న్ అవుతోంది?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటివరకు అమలు చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేయాలన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని చెప్పుకొచ్చారు.