ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా మధుర జ్ఞాపకం అన్నారు. మా ప్రభుత్వం 30 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.. మరో 35 వేల ఉద్యోగాలను ఈ ఏడాది చివరిలోగా ఇస్తామన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన చెప్పుకొచ్చారు.