ఛాంబర్ ఆవరణలో టెంట్లు వేసి నిరసన తెలిపిన నిర్మాతలపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రచారం చేస్తున్నట్టుగా ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదని స్పషం చేశారు.
తెలుగు చలన చిత్రాలకు పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని, నిర్మాతల శ్రేయస్సు కోరి తెలుగు సినిమాను కాపాడుకుందామనే లక్ష్యంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
Telugu Film Producers Council: సినీ కార్మికుల వేతనాల విషయంలో ఎట్టకేలకు నిర్మాతల మండలి ఒక కీలక నిర్ణయం తీసుకొంది. కార్మికుల వేతనాలను పెంచడానికి అంగీకరించినట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
తెలుగు సినీ నిర్మాతల మండలి ఆధ్వర్యంలో సోమవారం (జూన్ 13న) హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో మధ్యాహ్నం 3.30కి కీలక సమావేశం జరుగబోతోంది. దీనికి సంబంధించి నిర్మాతల మండలి కార్యవర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలోని నిర్మాతలు, నిర్మాణంలో ఉన్న, నిర్మించబోతున్న నిర్మాతల సభ్యులకు ఈ సమావేశానికి ఆహ్వానం పంపారు. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వర్కర్స్ వేతనాల పెంపుదలతో…
తమిళ హీరో శింబుకు ఊరట కల్పించింది నిర్మాతల మండలి. ఈ హీరో కెరీర్ ప్రారంభం నుండి వివాదాలలో చిక్కుకుంటూనే ఉన్నాడు. కొంతమంది నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో ఆయన గొడవ చివరికి తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వరకూ చేరుకొని అక్కడ నుండి రెడ్ కార్డ్ నిషేధానికి దారి తీసింది. గతంలో శింబు ప్రధాన పాత్రలో “అన్బాధవన్ అసరదావన్ అడంగాదవన్” అనే సినిమా సమయంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాను తెరకెక్కించిన నిర్మాత మైఖేల్ రాయప్పన్…
తమిళ యువ కథానాయకుడు శింబు కారణంగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (పెఫ్సీ), తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ (టి.ఎఫ్.సి.సి.) మధ్య అగ్గి రాజుకుంది. దానికి శింబు నటిస్తున్న ‘వెందు తనిందదు కాడు’ సినిమా కారణం. శింబు గతంలో నలుగురైదుగురు నిర్మాతలతో చేసుకున్న ఒప్పందాన్ని నెరవేర్చకుండానే ఈ కొత్త సినిమాకు డేట్స్ కేటాయించాడు. దాంతో వాళ్ళంతా నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. మరీ ముఖ్యంగా శింబులో ‘ట్రిపుల్ ఎ’ మూవీ నిర్మించిన మైఖేల్ రాయప్పన్…