జమ్మూకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లలో అటు ఉగ్రవాదులు, ఇటు భద్రతాబలగాల సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామాలోని తన నివాసంలోనే ఓ ఎస్సైని కాల్చి చంపారు. మృతుడిని ఫరూక్ అహ్మద్ మీర్‌గా గుర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పుల్వామా జిల్లా పాంపొర్‌లోని సంబూరా ప్రాంతంలో సబ్ ఇన్స్పెక్టర్పై దాడి జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. లెథ్‌పొరా సీటీసీ ఐఆర్పీ 23వ బెటాలియన్లో మీర్ విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడినవారి…