SIMI Terrorist: నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమి) ఉగ్రవాది హనీఫ్ షేక్ పోలీసులకు చిక్కాడు. 22 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇతడిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ ఫిబ్రవరి 22న అరెస్ట్ చేసింది. కేవలం ఒకే ఒక క్లూ అయిన అతని మారుపేరు సాయంతో భయంకరమైన ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. ఇతడికి హనీఫ్ షేక్, మహ్మద్ హనీఫ్ మరియు హనీఫ్ హుదాయి పేర్లు ఉన్నాయి. 2002లో పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించారు.
Terrorist arrest: ఆర్మీలో పనిచేసిన జవాన్ లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారాడు. అతడిని ఢిల్లీ పోలీసులు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. రిటైర్డ్ ఆర్మీ సైనికుడు రియాజ్ అహ్మద్ గత కొంత కాలంగా లష్కర్ ఉగ్రవాదిగా పనిచేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు కుప్వారా జిల్లాలోని ఎల్‌ఈటీ మాడ్యుల్ చేధించిన కొద్ది రోజుల తర్వాత ఈ అరెస్ట్ చోటు చేసుకుంది.
కాన్పూర్‌లో రిటైర్డ్ టీచర్ రమేష్ బాబు శుక్లా హత్య కేసులో శిక్ష పడింది. రిటైర్డ్ ప్రిన్సిపల్ రమేష్ బాబు శుక్లా నుదుటిపై తిలకం, చేతికున్న కంకణాన్ని చూసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ హత్య ఉదంతంపై అక్టోబర్ 2016న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే తాజాగా.. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీవ్రవాదులు అతిఫ్ ముజఫర్, మహ్మద్ ఫైజల్‌లకు మరణశిక్ష విధించింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ ఎత్తు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కుల్గామ్ లో భద్రతా బలగాలు శుక్రవారం జైషే మహ్మద్ మాడ్యూల్ ను చేధించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి హ్యాండ్ గ్రెనేడ్, పిస్టల్, రెండు మోర్టల్ షెల్స్, భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.