Terrorist Masood Azhar: ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. ఈ దాడుల్లో అనేక మంది టెర్రరిస్టులు చనిపోయారు. అయితే, జైషే మహమ్మద్ అధినేత, మసూద్ అజార్ ఫ్యామిలీలోని 14 మంది ఈ దాడుల్లో చనిపోయారు. దీంతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయాల నష్టపరిహారం అందజేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మసూద్ అజార్‌కు నష్ట పరిహారం కింద సుమారు రూ. 14 కోట్లు దక్కే ఛాన్స్ ఉంది.
Read Also: Official : విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ రిలీజ్ డేట్ ఇదే
అయితే, భారత్ దాడుల్లో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వబోతున్నట్లు పాకిస్తాన్ పీఎంవో ప్రెస్ రిలీజ్‌లో ఈ విషయాన్ని తెలియజేసింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా బహవల్‌పుర్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడి చేసి చంపేసింది. పాక్ లోని 12వ అతిపెద్ద నగరం.. లాహోర్‌కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో బహవల్‌పుర్ పట్టణం ఉంది. జైషే ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. జామియా మజ్జీద్ సుభాన్ అల్లా లేదా ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అని కూడా దీన్ని పిలుస్తుంటారు.
Read Also: Mohan lal : లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను స్టార్ట్ చేసిన స్టార్ హీరో కొడుకు
కాగా, భారత సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో తన సోదరి, ఆమె భర్త, మేనల్లుడు.. అతని భార్య, మరదలు, మరో ఐదు మంది చిన్నారులు చనిపోయినట్లు మసూద్ అజార్ ప్రకటించారు. మొత్తం ఫ్యామిలీలో అతనొక్కడే ప్రస్తుతం బ్రతికి ఉన్నాడు. చనిపోయిన వారందరికి మసూద్ వారసుడు కాబట్టి.. అతడికి పాక్ సర్కార్ ఇచ్చే 14 కోట్లు దక్కనున్నాయి.