భారతదేశ సరిహద్దులు దాటొచ్చిని ముష్కరులకు భారత భద్రత దళాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అయితే తాజాగా.. పుల్వామాలోని ద్రాబ్‌గామ్ ప్రాంతంలో మరో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు హతమార్చాయి. శనివారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైన విషయం తెలిసిందే. అయితే.. దీంతో ఈ సంఖ్య మూడుకు చేరింది. వారంతా లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. వారిని ఫాజిల్ నజీర్…
శ్రీనగర్‌లోని బెమీనాలో గల స్కిమ్స్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. అనంతరం ఉగ్రవాదులు భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కాల్పులను తిప్పికొట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఆసుపత్రిలోని సిబ్బందిని, పౌరులను అడ్డుపెట్టుకొని తప్పించుకున్నట్లు శ్రీనగర్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు శ్రీనగర్ పోలీసులు, భద్రత బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే.. భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి… ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని.. తమకు సమాచారం చేరినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి.. డ్రోన్లతో దాడికి ఉగ్రవాదుల కుట్రపన్నారని వెల్లడించిన ఇంటెలీజెన్స్ బ్యూరో… దేశ రాజధానిలో ‘ఆపరేషన్ జెహాద్’ ను ప్రారంభించడానికి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. ఆగస్టు 15కు ముందే దాడులకు ప్రణాళికలు వేసినట్టు చెబుతున్నారు.. ఈ ఉగ్రదాడిని అడ్డుకోవడానికి అలర్ట్‌గా…
నాలుగవ తేదీ న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. అందులో హుజూరాబాద్ ఉప ఎన్నిక తో పాటు… రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాల పై చర్చ ఉంటుంది అని అన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్. హైదరాబాద్ తీవ్రవాదులకు అడ్డాగా మారింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చి అక్రమంగా ఉంటున్నారని మేము చెబుతూనే ఉన్నాం. బోధన్, బైంసా, నల్గొండ, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా దొంగ పాస్పోర్ట్ లతో ఉంటున్నారు. మత కోణంలో వారి…
తెలంగాణ పోలీసులకు, కౌంటర్ ఇంటెలజెన్స్ లకు మల్లేపల్లి ఓ సవాల్ గా మారింది. కానీ ఆ మల్లేపల్లి పై కొరవడింది పోలీసుల నిఘా. అక్కడ పోలీసుల సెర్చ్ ఆపరేషన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. మర్కాజ్ ఘటన తర్వాత మల్లేపల్లి పై దృష్టి పెట్టారు పోలీసులు. అయినా పోలీసులకు మాలిక్ బ్రదర్స్ చిక్కలేదు. హైదరాబాద్ లో స్లీపర్ సేల్స్ కు అడ్డాగా మల్లేపల్లి మారింది అంటున్నారు. మల్లేపల్లి లో న 20 సంవత్సరాల నుండి ఉంటున్నార ఉగ్రవాదులు మాలిక్ సోదరులు.…
బీహార్ దర్భంగా బ్లాస్ట్ కేసులో మరో టెర్రరిస్ట్ ను గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. ఈ కేసులో కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు అలాగే ఎన్ఐఏ అధికారులు కలిసి హైదరాబాద్ లో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఇప్పటికే మాలిక్ బ్రదర్స్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మాలిక్ బ్రదర్స్ తో టచ్ లో ఉంటూ బ్లాస్ట్ ప్లాన్ లో ఇన్వాల్ అయిన మూడో వ్యక్తిని గుర్తించారు. ఆ మూడో వ్యక్తి…