Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు త్రాల్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌తో భద్రతా బలగాలు విజయం సాధించాయి. ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఈ రోజు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌కి ముందు, ఉగ్రవాది అమీర్ నజీర్ వానితో అతడి తల్లి వీడియో కాల్‌లో మాట్లాడింది. లొంగిపోవాలని వేడుకుంది. ఆ సమయంలో నజీర్ ఏకే-47 గన్‌తో కనిపించాడు. తల్లి లొంగిపోవాలని చెప్పినప్పటికీ అతను ఒప్పుకోకపోవడంతో చివరకు ఎన్‌కౌంటర్‌లో హతమత్యాడు.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఊహించని ఝలక్.. మరో కేసులో పీటీ వారెంట్..
తన తల్లితో మాట్లాడుతూ.. సైన్యం ముందుకు రానివ్వండి, అప్పుడు నేను చూస్తాను అని ఉగ్రవాది చెప్పడం వీడియో వినవచ్చు. జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరణించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదుల్ని సిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వాని, యావర్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. వీరందరూ పుల్వామా జిల్లా నివాసితులు. ఎన్‌కౌంటర్‌కి ముందు అమీర్ నజీర్, తను దాక్కున్న ఇంటి నుంచి తల్లి, సోదరితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఉగ్రవాదులను లొంగిపోవాలని భద్రతా దళాలు కోరినప్పటికీ, వారు వినకుండా కాల్పులు జరిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు హతమయ్యారు.
जम्मू-कश्मीर: त्राल एनकाउंटर से जुड़ी बहुत बड़ी खबर
एनकाउंटर से पहले आतंकी का वीडियो आया सामने
अपनी मां से वीडियो कॉल पर बात करता दिखा आतंकी
मां आतंकी से कर रही सरेंडर करने की अपील#TralEncounter #AamirNazirWani #ATReel pic.twitter.com/SrUvN5CM76— Journalist Deepika singh (@Deepikasingh043) May 15, 2025