Khyber Pakhtunkhwa: ప్రపంచంపై ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాపం ఇప్పుడు పాకిస్థాన్‌ను పట్టిపీడుస్తుంది. ఇటీవల కాలంలో దాయాది దేశంలోనే అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందుగా పాక్-భారత్ ఘర్షణలు, తర్వాత దాయాది దేశంలో పర్యావరణ ప్రకోపం, ఆ తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌తో సంఘర్షణలు. ఇవన్నీ పాకిస్థాన్ చేసుకున్న స్వయంకృత పాపాలే. తాజాగా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాపై దాయాది దేశం పట్టుకోల్పోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతకీ పాకిస్థాన్‌లో ఏం జరుగుతుంది.. READ ALSO: DYCM Pawan Kalyan: అటవీశాఖ…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ గురువారం బాంబు పేలుడు కారణంగా 9 మంది మరణించినట్లు, నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పాక్ మీడియా నివేదించింది. ఈ సంఘటన వివరాలను పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ మియాన్ సయీద్ కార్యాలయం ధృవీకరించిందని డాన్ మీడియా తెలిపింది. ఈ సంఘటన తర్వాత పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి.
Hafiz Saeed: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఉగ్రవాది మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించడానికి పాకిస్తాన్‌కు అభ్యంతరం లేదని పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా దీనిని అభివర్ణించారు. అయితే, బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై హఫీజ్ సయీద్ కొడుకు, ఉగ్రవాది తల్హ సయీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భుట్టో్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్‌కు అవమానం తెచ్చిపెట్టేలా ఉన్నాయని అన్నారు.
పాకిస్థాన్ లో సైన్యానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య లోతైన సంబంధం ఉందని మరోసారి స్పష్టమైంది. ఇటీవల, సింధ్ ప్రావిన్స్‌లోని మట్లి ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాది రజౌల్లా నిజామాని అలియాస్ సైఫుల్లా గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. సైఫుల్లా మరణం పట్ల పాకిస్థాన్ మర్కజ్ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) సింధ్ యూనిట్ సంతాప సమావేశం నిర్వహించింది.
పాకిస్థాన్‌లో ఓ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు విద్యార్థులు మరణించారు. దాదాపు 38 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బలోచిస్థాన్‌లోని కుజ్‌దార్ ప్రావిన్స్‌లో ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తి సమాచారం అందించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఆత్మహుతి కోసం ఓ…
పహల్గాం టెర్రర్ ఎటాక్ తర్వాత భారత్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ కు తగిన బుద్ధి చెప్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో హడలెత్తిస్తోంది. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులను నిర్వహిస్తోంది. అయితే పాక్ తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. అసలు మా దేశంలో ఉగ్రస్థావరాలే లేవు అంటూ అక్కడి మంత్రులు స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పుడు పాక్ వక్రబుద్ధి బయటపడింది. 2019 పుల్వామా దాడిలో తమ ప్రమేయం…
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ జాతీయ భద్రతపై పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం రేపు (మంగళవారం) జరుగనుంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో ఇటీవల ఉగ్రవాద దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
Pakistan: పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా నెమ్మదిగా ఆ దేశంలో తమ వ్యాపారాలను మూసేస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి, ఉగ్రవాదం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై తరుచుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, పాక్ తాలిబాన్లు దాడులకు తెగబడుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో పనిచేసే చైనీయులు భయంతో పనులు చేస్తున్నారు. చివరకు చైనా తమ పౌరులు సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని…
Terrorism Is Pakistan's Foremost Problem: దాయాది దేశం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశంగా ఉంది. ప్రపంచంలోని పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ కేంద్రం. భారతదేశంపై ఎప్పటికప్పుడు సీమాంతర తీవ్రవాదాన్ని ఎగదోస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ఎప్పుడూ కూడా తమదేశం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం లేదని బుకాయిస్తూనే ఉంటుంది. అయితే తమ వరకు వస్తే కానీ నొప్పి తెలియదన్నట్లు.. తాజాగా పాకిస్తాన్ లో లక్కీమార్వాట్ లో పోలీస్ వ్యాన్ పై ఉగ్రదాడి జరిగింది. అయితే దీన్ని ఖండించారు పాకిస్తాన్…
Public protests against the government in Pakistan: ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వానికి షాక్ ఇస్తున్నారు అక్కడి ప్రజలు. అమెరికా రాయబారి డోనాల్డ్ బ్లోమ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పర్యటన ద్వారా మైలేజ్ పొందాలని భావిస్తున్న పాకిస్తాన్ కు షాక్ ఇస్తున్నారు ప్రజలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని స్వాత్ లోయలో ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. షెహజాబ్ షరీఫ్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం…