పహల్గాం టెర్రర్ ఎటాక్ తర్వాత భారత్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ కు తగిన బుద్ధి చెప్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో హడలెత్తిస్తోంది. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులను నిర్వహిస్తోంది. అయితే పాక్ తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. అసలు మా దేశంలో ఉగ్రస్థావరాలే లేవు అంటూ అక్కడి మంత్రులు స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పుడు పాక్ వక్రబుద్ధి బయటపడింది. 2019 పుల్వామా దాడిలో తమ ప్రమేయం ఉందని పాకిస్తాన్ సైన్యం అంగీకరించింది.
Also Read:Indian Air Force: ఆపరేషన్ సింధూర్ పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక ప్రకటన..
2019లో పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది హత్యలో తమ పాత్ర ఉందని పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారులు అంగీకరించారు. పుల్వామా ఉగ్రవాద దాడి పాకిస్తాన్ సైన్యం యొక్క “వ్యూహాత్మక ప్రతిభ” అని పాకిస్తాన్ వైమానిక దళంలోని ఉన్నతాధికారి తెలిపారు. దీంతో ఇస్లామాబాద్ రావల్పిండి ఉగ్రవాద రహస్యం బయటపడింది. పుల్వామాలో మా వ్యూహాత్మక దాడితో మా పవర్ చూపించామని ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీంతో పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ నిర్దోషి అని చెప్పడానికి వీలు లేకుండా పోయింది.
Also Read:India Pakistan War: భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అనేక ప్రశ్నలు..
జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) ఆత్మాహుతి దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మృతి చెందిన పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రమేయాన్ని నిరంతరం ఖండిస్తోంది. అప్పటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ దాడిని “తీవ్ర ఆందోళన కలిగించే విషయం” అని తెలిపారు. కానీ దాడిలో దాని సైనిక సంస్థ పాత్రను తిరస్కరించారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారతదేశం POK లోని బాలాకోట్‌లోని JeM ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఆపరేషన్‌లో JeM అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని 12 మిరాజ్ 2000 జెట్‌లు పాల్గొన్నాయి.