Allahabad HC: లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు తన గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునే హక్కును చట్టం కల్పిస్తుందని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. 17 ఏళ్ల బాలిక తనకు బిడ్డ కావాలా వద్దా అని నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఈ కామెంట్స్ చేసింది. 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు గర్భాన్ని వైద్యపరంగా తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు మహేష్ చంద్ర త్రిపాఠి, ప్రశాంత్ కుమార్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది.
Bombay High Court: మేధో వైకల్యం ఉన్న మహిళకు తల్లి అయ్యే హక్కు లేదా..? అని బాంబే హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. 27 ఏళ్ల యువతి మానసిక స్థితి సరిగా లేదని, అవివాహితురాలు కావడంతో 21 వారాల గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఆర్‌వి ఘుగే, రాజేష్ పాటిల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తన కుమార్తె గర్భాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు కూడా పిటిషన్‌లో…
High Court: టీనేజ్‌లో అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాధితురాలకి కోర్టు ఉపశమనం కలిగించింది. అత్యాచారా బాధితురాలు తన 8 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో విచారణపై వెనక్కి తగ్గబోమని, దీనిపై అఫిడవిట్ సమర్పించాలని బాధితురాలి తండ్రిని కోర్టు ఆదేశించింది. తన గర్భాన్ని రద్దు చేయాలంటూ మైనర్ సర్వైవర్ చేసిన పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు జనవరి 2న ఉత్తర్వులు జారీ చేసింది.
Supreme Court: 26 వారాల గర్భాన్ని తొలగించాలన్న వివాహిత అభ్యర్థనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)ఇచ్చిన నివేదిక ఆధారంగా.. గర్భాన్ని తొలగించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. గర్భంలో ఉన్న శిశువుకు ఎలాంటి సమస్యలు లేవని పేర్కొంది.
Gujarat High Court: బాలిక అబార్షన్ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 17 ఏళ్ల బాలిక తన 7 నెలల గర్భాన్ని తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది కోర్టు. గతంలో 14-15 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలు పెళ్లి చేసుకుని, 17 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చేవారని గుజరాత్ హైకోర్టు గురువారం మౌఖికంగా వ్యాఖ్యానించింది.
Minor Moves Delhi High Court For Termination Of 16-Week Pregnancy: తన గర్భాన్ని రద్దు చేయాలని కోరుతూ 14 ఏళ్ల మైనర్ తన తల్లి సహాయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మైనర్ అయిన బాలిక, మరో మైనర్ బాలుడు లైంగిక చర్య ద్వారా గర్భాన్ని దాల్చింది. దీంతో వైద్యపరంగా తన గర్భాన్ని రద్దు చేయాలని చెబుతూ కోర్టును ఆశ్రయించింది. బాలిక, బాలుడు ఏకాభిప్రాయం ద్వారా లైంగిక చర్యలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యాజ్యం…