Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suri Brutally Murder: హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సోమవారం అర్థరాత్రి టీకేఆర్ కాలేజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షలు, ప్రతీకారమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందనవనం సూరిపై గతంలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. కొద్ది నెలల క్రితం అతనిపై నగర బహిష్కరణ కూడా విధించారు. గతంలో తన భార్యతో పాటు సల్మాన్ హత్య కేసులో సూరి నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుక ఉందంటూ అఫ్రోజ్, సూరిని టీకేఆర్ కాలేజ్ సమీపానికి పిలిపించినట్లు సమాచారం. అక్కడికి చేరుకున్న వెంటనే ముందుగా అతని కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి ప్రతిఘటించే అవకాశం లేకుండా చేశారు.
Also Read
- Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
పెప్పర్ స్ప్రే చల్లిన తర్వాత అఫ్రోజ్తో పాటు మరికొందరు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయిన సూరిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, మీర్పేట్ ఇన్స్పెక్టర్ శోభనతో పాటు పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ హత్య వెనుక వ్యక్తిగత కక్షలు, గతంలో జరిగిన హత్య కేసుకు సంబంధించిన ప్రతీకారమే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్తో పాటు ఘటనలో పాల్గొన్న ఇతర నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
తాజావార్తలు
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!