Be Ready with B Better: కాసులు లేకపోయినా పర్లేదు గానీ కాలూ చెయ్యీ బాగుంటే చాలు.. అదే పది వేలు.. అంటుంటారు పెద్దలు. ఇది అక్షర సత్యం. లక్షల విలువ చేసే మాట. కానీ.. ఫిట్‌నెస్ విషయంలో అప్పటివాళ్లకు, ఇప్పటివాళ్లకు చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో ఆహారపు అలవాట్లు వేరు. వాళ్ల జీవన శైలి సైతం ఎంతో విభిన్నంగా ఉండేది. ప్రజెంట్ జనరేషన్ లైఫ్ స్టైల్‌కి అస్సలు పోలికే లేదు. అందుకే ఆ తరంవాళ్లు…
Simona Halep: తన ఆటతో పాటు అందంతో అభిమానులను ఆకట్టుకున్న రొమేనియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి సిమోనా హలెప్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది.
పంచ టెన్నిస్ ప్రేమికులను కంటతడి పెట్టించే మరో చేదువార్త. సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్‌తో అభిమానులు ఆ బాధను మరిచిపోక ముందే.. రెండు దశాబ్దాలకు పైగా క్రీడాభిమానులను తన ఆటతీరుతో ఆకట్టుకున్న స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా తన ప్రస్థానాన్ని ముగించాడు.
మహిళలకు ఏ రంగంలోనూ భద్రత లేదు. కాటు వేయడానికి కామాంధులు ప్రతీ చోటా కాచుకొని ఉంటారు. మహిళల బలహీనతల్ని అదునుగా మార్చుకొని, వారిపై లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. తానూ అలాంటి వేధింపులకు గురైన బాధితురాలినేనంటూ తాజాగా మాజీ టెన్నిస్ స్టార్ ఆండ్రియా జేగర్ బాంబ్ పేల్చింది. తనపై 30కి పైగా సందర్భల్లో లైంగిక దాడులు జరిగాయని ఆమె కుండబద్దలు కొట్టింది. ‘‘1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ కు చెందిన స్టాఫ్ మెంబర్ ఒకరు నాపై 30కి…
ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ మరోసారి తన సత్తా చాటాడు. ఆదివారం నాడు ఏకపక్షంగా సాగిల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌ను 6-3, 6-3, 6-0 స్కోరు తేడాతో నాదల్ సులభంగా ఓడించాడు. తొలి రెండు సెట్లలో ఓ మోస్తరు ప్రతిఘటన కనబర్చిన రూడ్ చివరి సెట్‌లో మాత్రం నాదల్ దూకుడుకు తలవంచాడు. దీంతో రికార్డు స్థాయిలో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నాదల్ కైవసం చేసుకున్నాడు. ఓవరాల్‌గా…
పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్ మార్సెలో అరివలో–జీన్ జులియెన్ రోజర్ జోడి చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్–డచ్ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు. 2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన…
ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి ఊహించిందే జరిగింది. మట్టి కోర్టులో రారాజు, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. వరల్డ్ నెంబర్ వన్‌కు షాకిచ్చి పురుషుల సింగిల్స్ లో సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో 6-2, 4-6, 6-2, 7-6 (7-4) తేడాతో వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్‌పై విజయం సాధించాడు నాదల్. సెర్బియాకు చెందిన జకోవిచ్ ప్రస్తుతం పురుషుల టెన్నిస్ సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్. అయితే, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో…