Andrea Jaeger: మద్యం తాగించి.. 30 సార్లు లైంగికంగా వేధించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు ఏ రంగంలోనూ భద్రత లేదు. కాటు వేయడానికి కామాంధులు ప్రతీ చోటా కాచుకొని ఉంటారు. మహిళల బలహీనతల్ని అదునుగా మార్చుకొని, వారిపై లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. తానూ అలాంటి వేధింపులకు గురైన బాధితురాలినేనంటూ తాజాగా మాజీ టెన్నిస్ స్టార్ ఆండ్రియా జేగర్ బాంబ్ పేల్చింది. తనపై 30కి పైగా సందర్భల్లో లైంగిక దాడులు జరిగాయని ఆమె కుండబద్దలు కొట్టింది.
‘‘1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ కు చెందిన స్టాఫ్ మెంబర్ ఒకరు నాపై 30కి పైగా సందర్భాల్లో లైంగికంగా దాడులకు పాల్పడ్డారు. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా టెన్నిస్ అసోసియేషన్‌కు చెందిన మరో ప్రముఖుడు, నాకు మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడు. అది తన కెరీర్ ప్రారంభం కాబట్టి, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక లోలోపలే మదన పడ్డాను’’ అని ఆండ్రియా పేర్కొంది. అంతేకాదు.. లాకర్ రూమ్ లో కూడా తనని వేధించారంది. ఓ మహిళ తనను ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిందని, ఆ విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కుంటావంటూ ఆమె బెదిరించిందని తెలిపింది. కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న వేధింపులు అన్నీ ఇన్నీ కావంటూ 57 ఏళ్ల ఆండ్రియా జెగర్ తన ఆవేదన చెప్పుకొచ్చింది.
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
కాగా.. 1980వ దశకంలో మహిళల టెన్నిస్‌లో ఆండ్రియా జేగర్ స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు గడించింది. 1982 ఫ్రెంచ్ ఓపెన్, 1983 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. 10కి పైగా టైటిళ్లు సాధించిన ఈమె కెరీర్.. భుజం గాయం కారణంగా అర్ధంతరంగా ముగిసింది. ఇప్పుడు లైంగిక వేధింపుల వ్యాఖ్యలతో ఇన్నాళ్ల తర్వాత వార్తల్లోకెక్కింది.
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!