AP Cabinet Meeting: నేడు (జూన్ 24) ఉదయం 11 గంటలకు ఏపి క్యాబినెట్ భేటీ అమరావతి వేదికగా జరగనుంది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఇందులో భాగంగా.. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ సమావేశంలో వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటు కు సంబంధించి చర్చ జరగనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450…
రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణంలో పురోగతి లభించింది. హైదరాబాద్ నార్త్ పార్ట్‌కి కేంద్ర ప్రభుత్వం టెండర్స్ కాల్ ఫర్ చేసింది. నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే కి కేంద్రం టెండర్స్ పిలిచింది. సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు టెండర్స్ పిలిచింది. మొత్తం నాలుగు పార్ట్స్‌గా రోడ్డు నిర్మాణానికి టెండర్స్ పిలిచింది. 5,555 కోట్ల రూపాయల పనులకు కేంద్రం టెండర్లను పిలిచింది.
ఏడాది క్రితం అకాల వర్షాలతో తడిచిన ధాన్యం విక్రయాల్లో పౌరసరఫరాల శాఖకు రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టం వాటిల్లేలా గత ప్రభుత్వం ప్రయత్నించింది. మెట్రిక్ టన్నుకు రూ.3 వేలకుపైగా తక్కువకు టెండర్ కట్టబెట్టినా.. కొనుగోలుదారులు ఆ మొత్తం కూడా చెల్లించేందుకు ఇష్టపడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేశారు. తాజాగా పిలిచిన టెండర్లలో గతం కన్నా ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.3 వేలు అదనంగా టెండర్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన పౌరసరఫరాల…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం టెండర్లకు గడువు ముగిసింది. రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు దరఖాస్తుల సంఖ్య లక్ష దాటినట్లు తెలుస్తుంది. అయితే, ఎక్సైజ్ అధికారుల అంచనాకు మించి దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 659 అద్దె బస్సులు ప్రవేశపెట్టేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. 203 పల్లె వెలుగు, 208 ఆల్ట్రా పల్లె వెలుగు, 39 మెట్రో ఎక్స్‌ప్రెస్, 70 ఎక్స్‌ప్రెస్, 22 అల్ట్రా డీలక్స్, 46 సూపర్ లగ్జరీ, 9 ఏసీ స్లీపర్, 47 నాన్ ఏసీ స్లీపర్, 6 ఇంద్ర బస్సులు, 9 సిటీ ఆర్డినరీ బస్సులకు ఆర్టీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. జిల్లాల వారీగా అద్దె బస్సులు, సంఖ్యను నిర్ణయించి ఈ మేరకు టెండర్లను ఆహ్వానించారు. నేటి…
ఎయిమ్స్ ఉన్నతాధికారులకు తలంటేశారు కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్. మంగళగిరి ఎయిమ్స్ ని ఆమె సందర్శించారు. ఓపీ మొదలుకుని ఆస్పత్రిలో అందుతోన్న ప్రతి ఒక్క సేవ పైనా ఎయిమ్స్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు పవార్. దీంతో నీళ్లు నమిలారు ఎయిమ్స్ అధికారులు. ఆస్పత్రికి నీటి సమస్య ఉందని.. టెండర్లు రావడం లేదన్నారు అధికారులు. ఇంత పెద్ద భవనాలు కట్టడానికి టెండర్లు వచ్చినప్పుడు.. నీటి సరఫరా కోసం టెండర్లు ఎందుకు రావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.…
సంక్రాంతికి ముందే కోనసీమలో రాజకీయ పందెంకోళ్లు సెగ పుట్టిస్తున్నాయా? రోడ్డు పనులపై రచ్చ రంబోలా అవుతోందా? వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు.. విమర్శలు.. అవినీతిలో కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తున్నాయా? రాజకీయంగా వేడెక్కిస్తున్న అంశాలేంటి? తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం-కొత్తపేట రోడ్డు నిర్మాణ పనులు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి. పది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అనేక మలుపులు తిరిగి వైసీపీ, టీడీపీ మధ్య రచ్చ రచ్చ అవుతోంది. అధ్వాన్నంగా తయారైన ఈ రహదారికి మరమ్మతులు చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీలు…