Marri Rajashekar Reddy : మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేకపోవడం వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వినూత్నంగా నిరసన తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, అధికారుల వద్ద విజ్ఞప్తులు…