మొన్నటి మొన్న దీపావళి రోజు సూర్యగ్రహణం ఏర్పడగా.. 15 రోజుల తర్వాత పౌర్ణమి సందర్భంగా ఇవాళ చంద్రగ్రహణం ఏర్పడనుంది… సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారనున్నాడు.. దీనినే బ్లడ్ మూన్ అని కూడా అంటారు.. ఈ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండనున్నారు.. అయితే, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం దేశంలోని అన్ని ప్రాంతాల్లో కనిపించబోతోంది.. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం కార్తిక పౌర్ణమి భరణి నక్షత్రంలో.. ఇవాళ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.. ఇక, ఈ గ్రహణం ఇవాళ మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.27 గంటల వరకు ఉంటుందని చెబుతున్నారు.. ఇక, చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి.. ఈ ఆలయం ఎప్పుడు మూసివేస్తారు.. మళ్లీ తిరిగి దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయనే విషయాల్లోకి వెళ్తే..
* తిరుమలలో ఇవాళ 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు.. బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.. ఇవాళ ఉదయం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయన్నారు..
* యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనర్సింహ స్వామికి చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఇవాళ ఉదయం 8.15 గంటలకు ఆలయం మూసివేత.. రాత్రి 8 గంటలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ నిర్వహించనున్న అర్చకులు.. ఎల్లుండి ఉదయం నుంచి యథావిథిగా దర్శనాలు
* ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయం కూడా మూతపడనుంది.. తిరిగి రేపు సంప్రోక్షణ అనంతరం తెరుచుకోనుంది ఇంద్రకీలాద్రి… ఇవాళ ఉదయం 8 గంటల నుండి రేపటి వరకు అన్ని దర్శనాలు రద్దు చేశారు అధికారులు.
* వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇప్పటికే మూసివేశారు అధికారులు.. ఉదయం సుప్రభాత సేవ ప్రాత కాల పూజ అనంతరం ఆలయాన్ని మూసివేశారు.. ఇవాళ గ్రహణం అనంతరం సాయంత్రం 6:30 గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం తెరవనున్నారు.. రాత్రి 8 గంటల నుండి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు..
* జగిత్యాల జిల్లా : ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేశారు.. ఉదయము 5-00 గంటలకె అన్ని దేవాలయములలో గల శ్రీ స్వామివార్లకు అభిషేకాలు, హారతి మంత్రపుష్పం నిర్వహించిన ఆలయ అర్చకులు.. 6 గంటలకు ద్వారభందనం చేశారు.. రేపు ఉదయం 6 గంటలకు దేవాలయములు తెరిచి సంప్రోక్షణ, అభిషేకం నిర్వహించనున్నారు.. రేపు 9 గంటలకు భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
* భూపాలపల్లి: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేశారు.. ఉదయం స్వామి వారి ప్రాతఃకాల పూజ అనంతరం ఆలయాల ద్వారబంధనం చేశారు.. రేపు ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు..
* బాసర సరస్వతి అమ్మవారి ఆలయం మూసివేశారు అధికారులు..
* చంద్రగ్రహణం సందర్భంగా సింహాద్రి అప్పన్న దర్శనాలు పూర్తిగా రోజంతా నిలిపివేయనున్న ప్రకటించారు.. తిరిగి రేపు ఉదయం సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనాలు పునః ప్రారంభం కానున్నాయి..
* అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయం ఇవాళ ఉదయం 11 గంటలకు మూసివేయనున్నారు.. కార్తీక పౌర్ణమి సందర్బంగా ఇవాళ జరిగే గిరిప్రదక్షిణ ఉదయం 9.30కి ముగించనున్నారు..
* తిరుపతి: చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తీ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.. గ్రహణకాల పూజల కోసం భారీగా చేరుకుంటున్నారు భక్తులు
* నంద్యాల: చంద్రగ్రహణం సందర్భంగా నేడు శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేశారు.. ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల దాకా ఆలయం మూసిఉండనుండగా.. సంప్రోక్షణ అనంతరం రాత్రి 8 గంటల నుంచి భక్తులకు స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు..
* కర్నూలు జిల్లా: చంద్రగ్రహణం సందర్భంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు నిలిపివేశారు అధికారులు.. శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనం భక్తులకు నిజరూప దర్శనం కల్పించనున్నారు..
* నంద్యాల: చంద్రగ్రహణం సందర్భంగా నేడు మహానంది ఆలయం మూసివేత.. జగజ్జనని ఆలయంలో నేడు చంద్రగ్రహణం సందర్భంగా ప్రత్యేక పూజలు రాహుకాల పూజలు నిర్వహిస్తున్నారు..
* అనంతపురం : గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు.
* సత్యసాయి జిల్లా : చంద్రగ్రహణం కారణంగా కదిరి శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత
* ప్రకాశం : చంద్ర గ్రహణం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలు మూత.. గ్రహణం విడిచిన అనంతరం సంప్రోక్షణ పూర్తి చేసి తిరిగి ఆలయాలు తెరవనున్న అర్చకులు..
* తూర్పుగోదావరి జిల్లా : నేడు చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలోని అన్ని దేవాలయాలు మూసివేత.. ఉదయం 8 గంటలకు మూసివేసి తిరిగి బుధవారం తెల్లవారు జామున ఆలయ సంప్రోక్షణ చేసి ఉదయం తెరుస్తారు, భక్తులు ఆలయ మూసివేత సమయాలను గమనించాలని దేవాదాయ శాఖ అధికారులు విజ్ఞప్తి
* ఏలూరు: చంద్రగ్రహణం కారణంగా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం మూసివేత, నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు..
* గుంటూరు: చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల మూసివేత…
* అనంతపురం : చంద్రగ్రహణం కారణంగా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం మూసివేత.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆలయం మూసివేత.
* మెదక్: మూత పడనున్న ఏడుపాయల ఆలయం.. నిత్య పూజలు చేసి ఉదయం 9 గుంటలకు ఆలయాన్ని మూసివేయనున్న ఆలయ అధికారులు
* జోగులాంబ గద్వాల జిల్లా: చంద్రగ్రహణం సందర్భంగా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు మూసివేత.. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఆలయాలు మూసివేత.. సాయంత్రం 6:30 తర్వాత ఆలయ శుద్ధి, ఆలయ సంప్రోక్షణ అనంతరం మంగళ హారతితో సాయంత్రం 7.30 భక్తులకు దర్శన అవకాశం
* సంగారెడ్డి: చంద్రగ్రహణం కారణంగా ఝారసంగం కేతకి సంగమేశ్వర ఆలయం మూసివేత.. రేపు ఉదయం 9 గంటల తర్వాత సంప్రోక్షణ అనంతరం తెరుచుకొనున్న ఆలయం