తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల తర్వాత రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వడగాలులు, వేడితీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. నేటి నుంచి 5రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం 10 గంటల నుంచే ఎంత తీవ్రత అధికంగా ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఉదయం నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి.
ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతోంది. బయటికి వెళ్లాలంటే భయం పుట్టిస్తున్నాడు భానుడు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్‌లో ఎలా ఉంటుందోనని భయం వేస్తోంది. ప్రస్తుతం అన్ని కాలాలు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి. పోయిన ఏడాది చలికాలంలోనూ ఎండలు దంచికొట్టాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగింది. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు భగభగ మండిపోతున్నాడు. బెజవాడలో ఎండ తీవ్రత పెరిగింది. గతవారం రోజులుగా నిత్యం ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది.
వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు కోనసీమవాసులు.
రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో పని చేస్తామని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. దేశంలో రాజకీయ పార్టీలను భయపెట్టి పాలన సాగిస్తున్న బీజేపీకి ప్రజల చేతిలో ఓటమి ఖాయమన్నారు.
Marriage Muhurat: పుష్య మాసం ముగిసి మాఘమాసం వచ్చింది. మాఘమాసంలో వివాహ శుభ కార్యాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్. ఈ రెండు మూడు నెలల్లో ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు..
తెలుగు రాష్ట్రాలను పద్మ పురస్కారాలు వరించాయి. గురువారం కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఏపీకి రెండు పద్మవిభూషణ్లతో పాటు ఒక పద్మశ్రీ, తెలంగాణకు ఐదు పద్మశ్రీలు లభించాయి. ఈ సందర్భంగా పద్మశ్రీ గ్రహీతలు తమ సంతోషాన్ని ఎన్టీవీతో పంచుకున్నారు.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్లో జరిగిన దళాల పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన వీక్షకులను అబ్బురపరిచింది. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి చప్పట్లు కొట్టి ప్రశంసించారు.