Rain Alert: ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (శుక్రవారం) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దేశంలో 5జీ నెట్‌వర్క్ దూసుకుపోతోంది. క్రమ క్రమంగా ఈ నెట్‌వర్క్ గ్రామాలకు సైతం విస్తరించింది. టెలికాం నెట్‌వర్క్‌లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. 5జీ సేవలు మరిన్ని మారుమూల గ్రామాలకు చేరవేచే పనిలో ఉంది.
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడడం లేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి ప్రబావంతో.. ఇరురాష్ట్రాల్లోనూ పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా పలుజిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్‌ను అయితే వరుణుడు వీడడంలేదు. ఎప్పుడూ ఏదో ఓ ప్రాంతాన్ని భారీ వర్షం కుమ్మేస్తోంది. ఇప్పుడు ద్రోణి ప్రబావంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు..
తెలంగాణలో వరద, వర్ష ప్రభావంతో తీవ్ర నష్టం జరిగిందన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఖమ్మంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, రాష్ట్ర మంత్రులతో కలిసి పర్యటన చేశామన్నారు. సెక్రటేరియట్‌లో సమీక్ష చేపట్టామని ఆయన తెలిపారు.
Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇప్పటి వరకు 450కి పైగా రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పాటు 140 రైళ్లు దారి మళ్లించగా.. మరో 13 రైళ్లను పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది. రద్దైన వాటిలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు పలు పాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. రైల్వే ట్రాక్‌లు పూర్తిగా వరద నీటికి కొట్టుకుపోవడంతో ట్రైన్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
దేశవ్యాప్తంగా 234 నగరాల్లో కొత్తగా ఎఫ్.ఎమ్ రేడియో సౌకర్యం కల్పించనుంది. అందులో భాగంగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మరిన్ని ఎఫ్.ఎమ్ రేడియో కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 82,398 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుండగా.. ఔట్‌ఫ్లో నిల్‌గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు.
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మధ్య గురువారం స్నేహపూర్వక టెలిఫోనిక్ ఇంటరాక్షన్ జరిగినప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించాల్సిన అనేక దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటం ముఖ్యమంత్రులిద్దరికీ సవాలుగా మారడం ఖాయం. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌పై వివాదం ఈ ఏడాది మార్చిలో రెండు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించడంతో పరిష్కరించబడినప్పటికీ, ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల…
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశంలో మహిళా ఎంపీల తగ్గుదల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరిగినా, మహిళా ఎంపీలుగా ఎన్నికైనవారి సంఖ్య తగ్గడం గమనార్హం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 73 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్య 78గా ఉంది.
Heavy rains in Telugu states for 5 days: తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.