CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యాంగ రచనలో తెలుగువారి చిరస్మరణీయ పాత్రను గుర్తుచేశారు. 2025 సంవత్సరానికి రూపొందించిన అసెంబ్లీ క్యాలెండర్‌ను తన నివాసంలో శనివారం ఆవిష్కరించిన సందర్భంగా, తెలుగు ప్రముఖుల చిత్రాలతో, చరిత్రను ప్రతిబింబించేలా ఈ క్యాలెండర్ రూపొందించినట్లు సీఎం తెలిపారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోందని, ఈ సందర్భంలో రాజ్యాంగ రచనలో పాల్గొన్న తెలుగు ప్రముఖులను స్మరించుకుంటున్నామని చెప్పారు. గోబ్యాక్…