Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్, రాఘవేంద్ర రావు, శ్రీలీల అమెరికాలో నిర్వహించిన నాట్స్ ప్రోగ్రామ్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అమెరికాలో ఇంత మంది తెలుగు వాళ్లం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ కు నన్ను పిలిచినందుకు మీ అందరికీ థాంక్స్. తెలుగు వారంటే ఫైర్ అనుకున్నావా వైల్డ్ ఫైర్. అదే ఇప్పుడు అమెరికాలో కనిపిస్తుంది. నాట్స్ గురించి ఓ మాట చెబుతా. నాట్స్…
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ స్ఫూర్తి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి నేడు ఘనంగా జరిగింది. తెలుగు ప్రజలు ఈ రోజును సందడిగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ…సీనియర్ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ…
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్ వర్దంతిలో భాగంగా నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు నందమూరి బాలకృష్ణ. అక్కడ ఆయన నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు అనే పేరు తెలుగువారికి కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక చరిత్ర అని అన్నారు. నటనలో పరకాయ ప్రవేశం చేసి పాత్రను జీవంగా మలిచిన నటదిగ్గజం ఎన్టీఆర్. ఆయన నటనకు, కృషికి, అంకితభావానికి…
తెలుగు భాష సంగీతమైనటువంటి భాష అని.. ఈ మధ్యకాలంలో తెలుగు భాషపై దాడి జరిగిందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు భాషపై పట్టు వీడుతుందన్నారు. రాజకీయ నాయకులు సంక్షేమ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కానీ భాష గురించి ఆలోచించరన్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రమే తెలుగు భాష గురించి పట్టించుకున్నారన్నారు.