CM YS Jagan: సూడాన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వారు స్వస్థలాలకు చేరేంతవరకూ అండగా నిలవాలని స్పష్టం చేశారు.. దీని కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలి.. విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుని వారి స్వస్థలాలకు…
CM YS Jagan: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్ళలో నూతన సంవత్సర శోభను తెస్తూ, కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు,…
CM YS Jagan: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ సంతరించుకుంది.. ఇప్పటికే పట్నం వీడి పల్లె బాట పడుతున్నారు తెలుగు ప్రజలు.. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలివెళ్తున్నారు.. దీంతో, రోడ్లు, రైల్వేస్టేషన్, విమానాలు.. అన్నీ రద్దీగా మారిపోయాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్.. సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల…
దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు.. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు…
తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. మతాలపై నమ్మకం ఉండే వారి మనోభావాలను గౌరవించి పాలకులు నడుచుకోవాలని తెలిపారు. ఏ మతానికి సంబంధించిన పండుగులకైనా ఆంక్షలు విధించటం సరైంది కాదు. కోర్టుల ద్వారా అనుమతి తెచ్చుకుని పండుగులు నిర్వహించుకోవటం బాధాకరం. కోర్టు తీర్పును గౌరవించి నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. హైదరాబాద్ పండుగలకు కేంద్రం. గణేష్ చతుర్థి హైదరాబాద్ లో బాగా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా వినాయక చవితి ఎన్టీఆర్…