జగ్గారెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాతే సంగారెడ్డిలో అభివృద్ధి జరిగిందన్నారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగ్గారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంతో పని చేయించానన్నారు. జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఓట్ల కోసం బలహీనుడు కాలేడని, జగ్గారెడ్డి ఓడిపోవడం వల్ల సంగారెడ్డి ప్రజలే బాధపడుతున్నారన్నారు. సంగారెడ్డి లో ఒడిపోవాలని నేనే అనుకున్నానని ఆయన వెల్లడించారు. నన్ను ఓడించడానికి హరీష్ రావు 60 కోట్లు ఖర్చు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వస్తది, రేవంత్ సిఎం అవుతాడు అని ఆనాడే…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కుటుంబంతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెళ్లారు. భర్త అనిల్, కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుని, అక్కడి నుంచి ముఖ్యమంత్రి నివాసానికి షర్మిల వెళ్లారు.
కొందరు మంత్రుల ముఖ కవళికలు, వాళ్లు వాడుతున్న భాషను చూస్తుంటే…. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు గుర్తుకొస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కొందరు మంత్రుల్లో అప్పుడే అహంభావం కన్పిస్తోందని, ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అంటూ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా బండి సంజయ్ పై విధంగా స్పందించారు. ‘‘ఎవరికి ఎవరు కోవర్టో, ఏ పార్టీ నేతలు..…
గురుగ్రామ్‌లోని ఓ హోటల్లో 27 ఏళ్ల మోడల్ దివ్య పహుజా హత్య ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దివ్య పహుజా బల్దేవ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. సంచలనం సృష్టించిన హత్య కేసులో ఢిల్లీకి చెందిన అభిజీత్ అనే వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి భారత న్యాయ సంహితలోని నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్లతో స్థానిక కలెక్టర్ వ్యవహరించిన తీరు వివాదాస్పాదమైంది. ఈ నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్‌ను తొలగించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు.
ఊహించిన విధంగానే తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో దఫా భారీ ఐఏఎస్‌ల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసింది.తాజా ఉత్తర్వుల్లో 26 మంది టాప్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు.శాసనసభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం స్థిరపడి, ఏకకాలంలో 2024లో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నందున ఈ బదిలీలు కీలకమైనవి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను బదిలీ చేయడంతోపాటు రాష్ట్రంలోని 26 మంది ఐఏఎస్ అధికారులను…
ఈ ఏడాది చివర్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారానికి మెగా పుష్‌గా భావించే ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత పర్యటనలో 2వ రోజు త్రిసూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. బుధవారం కేరళలోని త్రిసూర్‌లో జరిగిన మహిళా సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ ఆశీస్సులు అందించిన మహిళా శక్తికి కృతజ్ఞతలు అని…
నేను ఉన్న పార్టీ జెండా ఎగరాలని కోరుకున్నాను.. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఓ ప్రైవేట్ పంక్షన్ హల్ లో కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ జన్మదిన వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గం కిర్తి ప్రతిష్ట నిలిపిన ప్రజలందరికి ధన్యవాదాలు చెప్పారు. నన్ను అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడటానికి ప్రాధాన్యత గల నియోజకవర్గం సత్తుపల్లి.. గతంలో ఏ ప్రభుత్వం…