iPhone 17 సిరీస్ లాంటి లుక్.. రూ.9 వేలకే సొంతం చేసుకోవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐఫోన్ కొనాలి అని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది.. అయితే, కొత్తగా వచ్చే ఐఫోన్ సిరీస్ ధరలు బడ్జెట్‌లో ఉండకపోవడంతో.. చాలా మంది వెనుకడుగు వేస్తారు.. అయితే, ఐఫోన్ 19 సిరీస్ ఫోన్ లాంటి లుక్‌లో ఉన్న ఓ బడ్జెట్ ఫోన్.. ఇప్పుడు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది.. టెక్నో తాజాగా Tecno Spark Go 3 అనే ఎంట్రీ లెవల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ నెలాఖరులో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నట్లు కనిపించినా, వాస్తవంగా ఇది సింగిల్ రియర్ కెమెరాతోనే వస్తుంది.
ధర వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ఒకే వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. 4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999గా ఉంది.. ఈ ఫోన్ అమ్మకాలు జనవరి 23 నుంచి అమెజాన్‌లో ప్రారంభమవుతాయి. ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చు. తరువాత దశలో ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులోకి రానుంది.
టైటానియం గ్రే, ఇంక్ బ్లాక్, గెలాక్సీ బ్లూ, అరోరా పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.
Also Read
- New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
- ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో పాటు ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 6.74 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ను అందించడం ఈ ధరలో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్‌కు Unisoc T7250 ప్రాసెసర్ శక్తినిస్తోంది. అలాగే IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ స్పాష్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది 4G స్మార్ట్‌ఫోన్ మాత్రమేనని గమనించాలి. కెమెరా సెక్షన్‌లో 13MP ప్రైమరీ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000mAh బ్యాటరీతో పాటు 15W ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. టెక్నో యొక్క Ella వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.
ఈ ఫోన్ కొనాలా?
స్టైలిష్ డిజైన్, పెద్ద డిస్‌ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ ఓ బడ్జెట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. అయితే ఇదే ధర పరిధిలో Redmi, Lava, Samsung వంటి బ్రాండ్ల నుంచి 5G సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు 2026లో కొత్త ఫోన్ కొనాలనుకుంటే, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 5G ఫోన్‌నే ఎంపిక చేసుకోవడం మంచిది. డిజైన్‌కు ప్రాధాన్యం ఇస్తే టెక్నో స్పార్క్ గో 3, టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తే 5G ఫోన్ మీకు సరైన ఎంపిక అవుతుంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!