Mukesh Ambani: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ FMCG రంగంలో మరో ప్రధాన అడుగు వేసింది. ఈ కంపెనీ బ్రైల్‌క్రీమ్, టోనీ & గై వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌ల ప్రపంచ హక్కులను సొంతం చేసుకుంది. ఈ కీలక ఒప్పందం ద్వారా, రిలయన్స్ తన పోర్ట్‌ఫోలియోలో గ్రూమింగ్, పర్సనల్ కేర్ ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన పేర్లను జోడించింది. భారతీయ, ప్రపంచ మార్కెట్లలో బలమైన ఉనికిని కలిగి ఉన్న ఒక ఐకానిక్ బ్రిటిష్ పురుషుల హెయిర్ స్టైలింగ్ బ్రాండ్ బ్రైల్‌క్రీమ్‌ను తాజాగా రిలయన్స్ కొనుగోలు చేసింది. దీంతో పాటు రిలయన్స్.. సెలూన్-నాణ్యత ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ప్రీమియం హెయిర్ కేర్ బ్రాండ్ టోని & గైని కూడా సొంతం చేసుకుంది. అదే టైంలో జర్మన్ బ్రాండ్ బాదేదాస్‌ను, బ్రిటిష్ బేబీ కేర్ బ్రాండ్ మెట్టీని సైతం కొనుగోలు చేసింది.
READ ALSO: Airtel Recharge Plan: 1.5GB రోజువారీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ.. ఇది కంపెనీ బెస్ట్ ప్లాన్!
అంబానీ ‘బ్యూటీ ప్లాన్’ ఇదే..
బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్‌పై పట్టును పటిష్టం చేసుకోవడమే కంపెనీ వ్యూహం అని రిలయన్స్ తెలిపింది. తాజాగా ఈ కంపెనీ కొనుగోలు చేసిన ఈ హై-ప్రొఫైల్ బ్రాండ్‌లకు ప్రపంచ హక్కులను పొందామని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఈ ఉత్పత్తులను రిలయన్స్ భారత మార్కెట్‌కు తిరిగి ప్రవేశపెట్టడమే కాకుండా విదేశాలకు కూడా విస్తరిస్తుంది. ఈ ఉత్పత్తులను భారతదేశంలో అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ మార్కెట్లలో వాటి పరిధిని విస్తరించడం తమ లక్ష్యమని కంపెనీ పేర్కొంది. అయితే ఈ ఒప్పందం మొత్తం విలువ గురించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
రిలయన్స్ వంటి ఒక పెద్ద కంపెనీ ఒక బ్రాండ్‌ను సొంతం చేసుకున్నప్పుడు, అతిపెద్ద మార్పు దాని స్కేల్‌పై పడుతుంది. ఇప్పటి వరకు “టోనీ & గై” లేదా “బడేడాస్” వంటి ప్రీమియం బ్రాండ్‌లు బహుశా ఎంపిక చేసిన కొన్ని లేదా పెద్ద నగరాల్లోని మాల్స్‌కు పరిమితం అయ్యాయి. రిలయన్స్ దేశంలో అతిపెద్ద రిటైల్, పంపిణీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దీంతో తాజాగా కొనుగోలు చేసిన బ్రాండ్ ఉత్పత్తులను చిన్న నగరాలు, పట్టణాలకు కూడా సులభంగా అందుబాటులో తీసుకురాగలదు.
READ ALSO: iPhone 17 సిరీస్ లాంటి లుక్.. రూ.9 వేలకే సొంతం చేసుకోవచ్చు..