ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సిట్టింగ్ స్ధానమైన అనకాపల్లి వీడి వెళ్లాల్సి వస్తుందన్నందుకు కంటతడి పెట్టుకున్నారు. రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన కార్యకర్తలు, నాయకుల రుణం ఎప్పటికైనా తీర్చుకుంటామని ఆయన అన్నారు.
ఇరాన్‌లోని కెర్మాన్ నగరంలో బుధవారం జరిగిన రెండు పేలుళ్లలో 100 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. జనరల్ ఖాసిం సులేమాని వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పేలుళ్లు జరిగాయి. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో సులేమానీ మరణించారు. అతను రివల్యూషనరీ గార్డ్స్ ఎలైట్ ఖుద్స్ ఫోర్స్‌కు అధిపతి. ఆయనను కెర్మాన్‌లో ఖననం చేశారు.
నేటి నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఓడిపోతుందని అనుకోలేదని గ్రామాల్లో చర్చ జరుగుతుందన్నారు. కొన్ని పథకాల విషయంలో చిన్న చిన్న లోటు పాట్లు ఉన్నాయని, పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదని నేతలు ఈ సమావేశం లో చెప్పారన్నారు కేటీఆర్. కొన్ని ఇబ్బందులు వచ్చాయి అవి కూడా మేము గుర్తించామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 ఉన్నాయన్నారు. అవన్నీ బుక్ లెట్ లో…
కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకున్న జగన్ మాపై పడటమేంటి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా శక్తికి కృతజ్ఞుడను.. కేరళలోని త్రిసూర్‌లో ప్రధాని మోడీ ప్రసంగం ఈ ఏడాది చివర్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారానికి మెగా పుష్‌గా భావించే ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత పర్యటనలో 2వ రోజు త్రిసూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. బుధవారం కేరళలోని త్రిసూర్‌లో జరిగిన మహిళా సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి…
తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణలో ప్రధాన ఐఏఎస్ అధికారుల బదిలీల జరిగిన రోజునే జరగడం గమనార్హం. అయితే.. టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీగా వి.వి.శ్రీనివాసరావు. డీఐజీ కోఆర్డినేషన్‌గా గజారావు భూపాల్. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమారాజేశ్వరి. రామగుండం సీపీగా ఎల్.ఎస్.చౌహాన్, మల్టీజోన్-7 డీఐజీగా జోయల్ డేవిస్.. మల్కాజ్గిరి డీసీపీగా పద్మజ, నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మిల. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా జానకీ ధరావత్. ఖమ్మం సీపీగా…
ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ హత్యకు గురై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆయన సమాధి సమీపంలో జరిగిన రెండు శక్తివంతమైన బాంబు పేలుళ్లలో కనీసం 73 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ మరోమారు ముందుకు వచ్చింది. బుధవారం సెక్రెటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో పోర్ట్స్ – సెజ్ సిఇఓ, గౌతమ్ అదాని పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదాని ఎరో స్పేస్ సిఇఓ ఆశీష్ రాజ్ వన్షి లతో చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అదానీ…
తిరువూరులో టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో జరిగిన వివాదంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కేశినేని చిన్ని ఎవరు ?.. చిన్ని ఎంపీనా, ఎమ్మెల్యేనా ? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయనే తాను సభలకు దూరంగా ఉంటున్నానని ఎంపీ తెలిపారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకు ఆలౌట్ అయింది. టీ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసిన టీమిండియా చివరి సెషన్లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ పరిస్థితిని మార్చేశారు.