వైకల్యం అనేది ఎవరి జీవితంలోనైనా శాపం లాంటిది. అంగవైకల్యం కారణంగా నిత్యజీవితానికి సంబంధించిన పనులు సక్రమంగా చేయలేకపోతారు. చాలా మంది కాళ్లతో వైకల్యంతో ఉంటారు. మరికొందరు చేతులతో వైకల్యంగా ఉన్న వారుంటారు. వారు ప్రతిరోజూ రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. తరచుగా వీధుల్లో లేదా రైల్వే స్టేషన్ లేదా దేవాలయాల వద్ద తిండి కోసం అడుక్కునే వికలాంగులను చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అందరూ ఎమోషనల్…
విశాఖ విమానాశ్రయంలో పండుగ రద్దీ వేళ పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సర్వీసులు రద్దు కావడంతో పండగ పూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక విశాఖ రావలసిన సర్వీసులు రద్దయ్యాయి.
తెలంగాణకు భారీఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావొస్ పర్యటన సాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, బలాబలాలు, తమ ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెబుతామని తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం…
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. చరిత్ర కలిగిన దేవాలయం శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, ఆలయ పూజారులు, అధికారులు గుట్టపై వున్న శివాలయం శిథిలావస్థలో వుందని తెలిపారు. దీంతో.. ఎంపీ నిధులు నుండి కొండపైన ఉన్న గుడి అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తా అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయిస్తానని బండి…
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కాసేపట్లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇండోర్‌లోని హోల్కర్ వేదికగా ఈ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలో తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దాదాపు 14 నెలల తర్వాత టీ20 ఇంటర్నేషనల్‌లో పునరాగమనం చేస్తున్నాడు.
ఆరు గ్యారంటీలు, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయాక సహనం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అర్హులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన వెల్లడించారు. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తాం… బిఆర్ఎస్ నేతలు చూస్తూ కూర్చోండని ఆయన వ్యాఖ్యానించారు. 5 సంవత్సరాలలో అందరూ ఆశ్చర్యపోయే రీతిలో అబివృద్ది చేస్తామని, గత ప్రభుత్వ…
ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు.
మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అవి కూడా మంచి చెడులను అర్థం చేసుకుంటాయి. అయితే వాటికి మాటలు రాని కారణంగా వ్యక్తీకరించలేకపోతున్నారనేది వేరే విషయం. జంతువులు నివసించే ప్రదేశంలోకి మానవులు వెళ్తే.. అవి వారిపై దాడి చేయడం చాలా సార్లు జరుగుతుంది. కానీ కొన్నిసార్లు జంతువులు.. మానవులకు సహాయకులు లేదా రక్షకులుగా ఉంటాయనేదానికి ఈ వీడియో ఉదాహరణ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ గొరిల్లా 5 ఏళ్ల చిన్నారి…
పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం నింపింది. గాలిపటం ఎగురవేస్తూ ఆకాష్ అనే 20 సంవత్సరాల యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్‌లో చోటు చేసుకుంది. మృతిచెందిన యువకుడు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజ శేఖర్ కుమారుడుగా తెలుస్తోంది. గాలిపటం ఎగురవేస్తూ, ప్రమాదవ శాత్తు భవనం పైనుండి ఆకాష్ పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది.…
భారత్-అఫ్గానిస్థాన్ మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోండగా.. సిరీస్ సమం చేయాలనే ఉద్దేశంతో అఫ్గానిస్థాన్ జట్టు రంగంలోకి దిగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరోవైపు.. యశస్వి జైస్వాల్ కంటే.. శుభ్‌మన్ గిల్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.…