Tamilnadu: సంక్రాంతి పండగకు తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ఆరంభమయ్యాయి. ఈ జల్లికట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఒక సంప్రదాయక క్రీడ.. దీంట్లో ఎద్దులకు మనుషులకు మధ్య పోరాటం జరుగుతుంది. జల్లుకట్టును తమిళనాడు సంస్కృతికి చిహ్నంగా అక్కడి ప్రజలు పరిగణిస్తారు. ఈ పోటీల నిర్వహణకు అవనియాపురంలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మదురైలో జల్లికట్టు నిర్వహణకు ముందుగా పోటీలో పాల్గొనే ఎద్దులకు హెల్త్ చెకప్ కూడా చేశారు. ఇక, జనవరి రెండో వారంలో పొంగల్ పంట పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు. వరుసగా మూడు రోజుల పాటు సాగే ఈ క్రీడలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు.
Read Also: Nizamabad: చాయ్ కోసం బస్సు ఆపితే.. కెమెరాకు చేయి అడ్డుపెట్టి 13 లక్షలు కొట్టేసారు
అయితే, మొదటి రోజు అవనియాపురంలో, రెండో రోజు పాలమేడులో, మూడో రోజు అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. కాగా, కొత్తగా నిర్మించిన మధురై జల్లికట్టు స్టేడియంను జనవరి 23న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఓపెనింగ్ చేయనున్నారు. మదురై జిల్లాలోని అలంగనల్లూరు సమీపంలో నిర్మిస్తున్న కొత్త జల్లికట్టు స్టేడియానికి రాష్ట్ర మాజీ సీఎం, దివంగత డీఎంకే అధినేత కరుణానిధి పేరు పెట్టారు. ఇక, జల్లికట్టు పోటీలలో పాల్గొనేవారు ఒక్కోసారి తీవ్రంగా గాయపడుతారు. ఇలాంటి పరిస్థితులను గమనించిన సుప్రీంకోర్టు జల్లికట్టు నిర్వహణకు పలు మార్గ దర్శకాలను జారీ చేసింది. స్థానిక అధికారులు కట్టుదిద్దమైన ఏర్పాట్లు చేసినప్పటికీ జల్లికట్టు పోటీల సమయంలో పలువురు గాయపడుతునే ఉన్నారు.