ఛత్తీస్ గడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున గంజాయి సరఫరా అవుతుంది. అది వ్యాపారంగా చాలా మంది చేస్తున్నారు. అదే దారి లో అదే వ్యాపారాన్ని కొంత మంది పోలీసులు కూడ కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ పోలీసు స్టేషన్ లో పట్టుకున్న గంజాయి మాయం అయ్యింది. అదే పోలీసు స్టేషన్ లో వాహనాలు మిస్ అయ్యాయంట.. అంతే కాదు మరో చోట మాత్రం ఓ కానిస్టేబుల్ ఏకంగా గంజాయిని ఓ బ్యాచ్ తో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటన కూడ వెలుగు చూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటనలు ఇవి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో ఓ కానిస్టేబుల్ గంజాయి తన అనుచరుల ద్వారా సరఫరా చేస్తు వరంగల టాస్క్ పోర్స్ పోలీసులకు పట్టు పడ్డారు. మరో ఘటన లో బూర్గంపహాడ్ పోలీసు స్టేషన్ లో నుంచిఇటీవల పట్టుకున్న గంజాయిని బయటకు తరలించిన ఘటన జరిగింది. అంతే కాకుండా ఆ పోలీసు స్టేషన్ నుంచి కొన్ని బైక్ లు కూడ మాయం అయినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రెండు ఘటనలపై పోలీసు యంత్రాంగం విచారణ కొనసాగిస్తుంది. బూర్గంపహాడ్ పోలీసు స్టేషన్ కు పాల్వంచ సబ్ డివిజనల్ పోలీసు అధికారులు హుటాహుటిన తరలి వెళ్లి విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే..
కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పోలీసు స్టేషన్ లో గంజాయి మాయం అయ్యింది. కాదు కాదు పట్టుకున్న గంజాయిని బయటకు తరలించి అమ్ముతున్న వైనం వెలుగు చూసింది. దీని వెనుక ఇంటి దొంగలు ఉన్నారా ఎవ్వరు అనే విషయంలో రహస్యంగా విచారణ సాగుతుంది. కొంత మంది గంజాయి అమ్ముతుండగా పోలీసులకు పట్టుపడ్డారు. అయితే ఈ గంజాయి ఎక్కడిది అని వివరాలు సేకరించగా తమకు పోలీసు స్టేషన్ నుంచే వచ్చిందని చెప్పడంలో విచారణ ముమ్మరం చేశారు. పాల్వంచ డిఎస్ పి వెంకటేష్ ఆద్వర్యంలో విచారణ సాగుతుంది. ఇటీవల కాలంలో భద్రాచలం నుంచి వరంగల్ వైపు వెళుతున్న గంజాయి ని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గురిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మోటార్ బైక్ లను సైతం పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అయితే ఈ గంజాయి తో పాటుగా మోటార్ వాహనాలు కూడ పోలీసు స్టేషన్ నుంచి మిస్ అయ్యాయి. గంజాయి, వాహనాలు మాయం కావడంతో దీనిపై రహస్య విచారణను పోలీసులు ప్రారంబించారు. పోలీసు స్టేషన్ లోభద్రత గా ఉండాల్సిన గంజాయి మాయం కావడంతో సమాచారం ఉన్నతాధికారులకు చేరింది. దీంతో ఒక్కసారిగా ఉన్నతాధికారులు అందరు బూర్గంపహాడ్ పోలీసు స్టేషన్ కు దారి కట్టారు. పోలీసు స్టేషన్ లో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈవిషయాన్ని మాత్రం బూర్గంపహాడ్ పోలీసులు స్పష్టం చేయడం లేదు. విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.
కట్ చేస్తే భద్రాచలం పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న మరో కానిస్టేబుల్ చెడు వ్యసనాలకు అలవటు పడ్డారు. అయితే ఇటీవల ఎన్నికల సమయంలో చెక్ పోస్టుల వద్ద డ్యూటీ పడింది. దీనిని అసరాగా తీసుకుని చెక్ పోస్టుల వద్ద నుంచి గంజాయిన తరలించడం లో కీలక పాత్ర పోషిస్టున్నారు. ఇలా చెక్ పోస్టుల వద్ద నుంచి గంజాయి తరలించే సమయలో కొంత మంది యువకులకు సహకరిస్తున్నారు. ఆ యువకులు అక్కడ నుంచి వెళ్లే టప్పుడు ముందుగా తానే ఉండి సహకారాన్ని అందిస్తున్నారు. ఈరోజు ఉదయం మణుగూర్ చెక్ పోస్టు వద్ద ఆ యువకులను కానిస్టేబుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.