జగిత్యాల బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్ లు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ప్రజలు వెయ్యి కండ్ల తో ఎదురు చూస్తున్నారని, తొమ్మిదిన్నర సంత్సరాలు ఎవరికి ఇబ్బందులు కలిగించలేదన్నారు కొప్పుల ఈశ్వర్. ప్రభుత్వం మారి నెల రోజులు కాగానే కాలువల్లో నీళ్లు లేవు. పింఛన్లు లేవు, తులం బంగారం లేదని, ఇప్పటి వరకు రైతు బందు పూర్తి స్థాయిలో ఇవ్వలేదన్నారు కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి ఎవరు సంబధం లేకుండా మాట్లాడుతున్నారని, పెన్షన్లు ఇస్తారా లేదా క్లారిటీ ఇవ్వండని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు చేస్తున్నారని, ఎందు కోసం చేస్తున్నారో తెలియదన్నారు. అవగాహన లేని సీఎం లా కనిపిస్తుందని, జీవన్ రెడ్డి ఊ అంటే కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నాడని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అల్లాటప్పా ప్రాజెక్ట్ కాదు.. ప్రపంచ ఖ్యాతి గాంచిన ప్రాజెక్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఖర్చు పెట్టింది 93 వేల కోట్లే…లక్ష కోట్లు అని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని, కాళేశ్వరం అంటే మేడి గడ్డ నే కాదు వందల కొద్దీ పంప్ హౌస్, కెనాల్స్ అని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు కాళేశ్వరం ద్వారా ఒక్క చుక్క నీరు అందించలేదని, ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసమే ఈ ఆరోపణలు అని కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం పై కమిటీని ఎందుకు వేయాలని కోరలేదని, రైతులు యాసంగి లో పంటలు పండుతాయే లేదో అని అవేదన లో ఉన్నారన్నారు. ప్రజా పాలన పేరుతో కోటి ఆప్లికేషన్ తీసుకున్నారు.మళ్ళీ ఇంటింటి సర్వే ఎందుకు చేస్తున్నారు కాలయాపన తప్ప మరేమీ లేదని, పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ సర్వేలు, ప్రజా పాలన కార్యక్రమాలు అని ఆయన అన్నారు. మోటార్లకు జీయో ట్యాగింగ్ చేస్తున్నారు. త్వరలో బిల్లులు కూడా వేస్తరని, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన నెలకే 9 వేల కోట్లు అప్పులు చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అని బదునం చేస్తున్నారని, బీఆర్ఎస్ ఆస్తులను పెంచిందని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను సర్పంచ్,ఎంపిపి,జెడ్పీటీసీ లను ఇబ్బందుల కు గురి చేస్తున్నారన్నారు. సర్పంచ్ లను సస్పెండ్ లు చేస్తున్నారని, అధికారం ఉందని చలాయిస్తే ఊరుకోమన్నారు.