రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం రాంలాలా పవిత్రోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాజాగా.. ప్రధాని మోదీ ఆ లేఖకు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను.. తన జీవితంలో మరచిపోలేని క్షణాలను చూసి అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీకు ఈ లేఖ రాస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. మీరు రాసిన లేఖ అందే సమయానికి నా మనసు భావోద్వేగంతో నిండిఉంది.. దాని నుంచి బయటపడేందుకు మీ లేఖ ఎంతో సహాయపడిందని అన్నారు. తన జీవితంలోని ప్రతి అధ్యాయంలో అందరి ఆదరణ, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, ప్రతి ఒక్కరి కృషికి స్ఫూర్తినిచ్చింది శ్రీరాముడేనని పేర్కొన్నారు.
Ram Mandir: రామ్లల్లా దర్శనానికి పోటెత్తిన భక్తులు.. తొలి రోజు ఎంతమంది దర్శించుకున్నారంటే..!
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ 11 రోజుల పాటు నిష్ఠగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి… ప్రధానిని అభినందిస్తూ రెండు రోజుల క్రితం లేఖ రాసిన విషయం తెలిసిందే. రామ్ లల్లాను ప్రత్యక్షంగా చూసి, ఆయన రూపాన్ని దర్శించుకుని, 140 కోట్ల మంది దేశప్రజలతో ఆయనకు స్వాగతం పలికిన ఆ క్షణం సాటిలేనిదని ప్రధాని మోదీ అన్నారు. శ్రీరాముని యొక్క శాశ్వతమైన ఆలోచనలు భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారమన్నారు. ఈ ఆలోచనల శక్తి 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తయారు చేయడానికి మన దేశ ప్రజలందరికీ మార్గం సుగమం చేస్తుందని మోడీ తెలిపారు. శ్రీరాముని యొక్క గొప్ప ఆలయం తమకు విజయం, అభివృద్ధి వైపు మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.
Cardamom Benefits : ఏలకులతో రక్తపోటు నియంత్రణ..!
కాగా.. ద్రౌపది ముర్ము ప్రధాన మంత్రికి రాసిన లేఖలో.. పీఎం జన్మన్ ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోడీ కృషి చేసిన విషయాన్ని ప్రస్తవించారు. గిరిజన సమాజంతో అనుబంధం కలిగి ఉన్న మీ కంటే దీన్ని ఎవరు బాగా అర్థం చేసుకోగలరు. మన సంస్కృతి ఎల్లప్పుడూ, సమాజంలోని అత్యంత అణగారిన వర్గం కోసం పనిచేయడం తమకు నేర్పిందన్నారు. పీఎం జన్మన్ నేడు దేశ ప్రజల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకువస్తున్నాయి. ముర్ము తెలిపారు.