హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్తులపై విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఇంట్లో దొరికిన ఎలక్ట్రానిక్ వస్తువులను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. హైటెక్ హంగులతో తన ఇంటిని డెకరేట్ చేశారు బాలకృష్ణ. అంతేకాకుండా.. అత్యంత ఖరీదైన 200 పైగా పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు.. అత్యంత ఖరీదైన అంతర్జాతీయ బ్రాండెడ్ కు చెందిన 120 వాచీలు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్, సిల్వర్, ప్లాటినం వాచ్ లను ఏసీబీ సీజ్ చేసింది. ట్యాగ్…
బీహార్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు కమలనాథులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తాజా పరిణామాలు, జేడీయూతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు ఆదివారమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీష్ కూడా చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయింది. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో టూర్ క్యాన్సిల్ అయింది. వాస్తవానికి ఆదివారం రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. ఈ క్రమంలో రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబంపై భూ కబ్జా కేసు నమోదయింది.. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఏ1 గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏ2 గా భార్య నీలిమా, ఏ3 మధుకర్ రెడ్డి పేర్లను చేర్చారు. కొర్రెముల్ల సర్వే నెంబర్ 796లో ప్లాట్లు కబ్జా చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 38ఈ హోల్డర్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి కబ్జాకు ప్రయత్నం చేశారని ఫిర్యాదులో తెలిపారు. పదేళ్లుగా 200 మందిని పల్లా రాజేశ్వర్ రెడ్డి నానా…
రాజ్ భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇవ్వగా.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. కాగా.. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు హాజరుకాగా.. బీఆర్ఎస్ నేతలు మాత్రం హాజరు కాలేదు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి హాజరయ్యారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా బృందం పాల్గొంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారత మాత విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ముందు ఓ కారు అగ్నికి ఆహుతైపోయింది. ఫ్లై ఓవర్ వద్ద కారు ఇంజన్ భాగం నుంచి పొగలు వస్తుండడం గమనించిన గోపాలపురం ట్రాఫిక్ కానిస్టేబుల్.. వాహనం పక్కకు నిలపాలని కారు యజమానికి సూచించాడు. కారు పక్కకు ఆపి కిందకు దిగేలోపే ఇంజన్ భాగం నుంచి మంటలు చెలరేగగా.. వెంటనే కారులో మొత్తం మంటలు వ్యాపించాయి. అప్పటికే యజమాని పక్కకు తప్పుకోగా.. నిమిషాల్లో కారు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటనపై…
తాము అధికారంలో ఉన్నప్పుడు విచారణలు చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్లమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ లో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో కేసీఆర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు, ప్రత్యర్థులపై దాడుల గురించి తాము ఆలోచించలేదు, ప్రజల కష్టాలు ఎలా తీర్చాలన్న విషయంపై ఆలోచించామన్నారు. ప్రతిపక్షాలపై ఎలా బురద జల్లాలి, ప్రజల్లో ఎలా బద్నాం చేయాలన్న విషయమై కాంగ్రెస్…
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలే రద్దు చేశారని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్ అంటూ ధ్వజమెత్తారు. మహిళా గవర్నర్ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించారని గుర్తుచేశారు. కనీసం గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ కూడా పాటించలేదని.. అంతేకాకుండా అధికారులను కూడా గవర్నర్ వద్దకు వెళ్లనీయలేదని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చందన వెళ్లి గ్రామంలో జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. స్ట్రింగర్ మిషన్ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి విధానం గురించి అక్కడ ఉన్న ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. సోలార్…