తాము అధికారంలో ఉన్నప్పుడు విచారణలు చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్లమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ లో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో కేసీఆర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు, ప్రత్యర్థులపై దాడుల గురించి తాము ఆలోచించలేదు, ప్రజల కష్టాలు ఎలా తీర్చాలన్న విషయంపై ఆలోచించామన్నారు. ప్రతిపక్షాలపై ఎలా బురద జల్లాలి, ప్రజల్లో ఎలా బద్నాం చేయాలన్న విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని హరీష్ రావు అన్నారు.
Bandi Sanjay: గవర్నర్‌ను బీఆర్ఎస్ ఎలా ఇబ్బంది పెట్టిందో ప్రజలు మరిచిపోలేదు..
మీరు రెచ్చగొట్టినా తాము మీ ట్రాప్ లో పడం.. ప్రజల పక్షాన పోరాడుతామని హరీష్ రావు పేర్కొ్న్నారు. ప్రభుత్వానికి విపక్షాలను కలుపుకొని పోయే తత్వం ఉండాలి.. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేలా ఉండాలని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అహంకారపూరిత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని హరీష్ రావు చెప్పారు. హామీల అమలు గురించి అడిగితే చెప్పుతో కొడతామని ఒకరు, మరొకరు మరో విధంగా అంటున్నారని పేర్కొన్నారు.
Joy E Bike: సికింద్రాబాద్‌లో “జాయ్ ఇ-బైక్” షోరూమ్ ప్రారంభం..
చెప్పిన దాన్ని గుర్తు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అసహనాన్ని వెళ్లగక్కుతున్నారని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ తమ పై బురద జల్లాలనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గురించి మీరు మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరును సమాజం గమనిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాక ముందే నెరవేర్చాలన్నారు. 420 హామీలు ఇచ్చారు.. అమలు చేయండి, ఎప్పుడు చేస్తారో చెప్పండని హరీష్ రావు డిమాండ్ చేశారు.