మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్ధిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీ నరసింహారావుకు భారత రత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని సీఎం తెలిపారు. ఆలస్యమైనా వారికి ఈ గౌరవం దక్కడం గర్వకారణం ఉందని పేర్కొన్నారు. నా తరపున, సభ తరపున, తెలంగాణ ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు…
HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించాడు. బాలకృష్ణ ద్వారా తమకు కావాల్సిన బిల్డింగ్లకు ఐఏఎస్ అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా పలు దఫాలుగా నగదు రూపంలో చెల్లింపులు జరిపినట్లు వెల్లడించారు. నార్సింగిలోని ఒక కంపెనీ వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ క్లియరెన్స్ చేశాడు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారత రత్న అవార్డు ఇవ్వడం పట్ల పీవీ స్వగ్రామం వంగర గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. పీవీకి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. భారత దేశానికి ఆర్థిక సంస్కరణలు తెచ్చి అభివృద్ధికి తోడ్పడిన పీవీని గౌరవించడం సంతోషకరం అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా.. పీవీ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాకుండా.. బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని…
రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి రోజా శుక్రవారం విశాఖ రైల్వే గ్రౌండ్లో ఆడుదాం – ఆంధ్రరాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మీకోసం, మీలో క్రీడా స్ఫూర్తి పెంచడం కోసం మన అందరి జగన్ అన్నా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంను ప్రారంభించారన్నారు మంత్రి రోజా. ఆడుతాం ఆంధ్ర మీ భవిష్యత్ కు నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. మండల స్థాయి, జిల్లా స్థాయి దాటి రాష్ట్ర స్థాయికి వచ్చారంటే…
కృష్ణ పట్నం పోర్టు లో కంటైనర్ టెర్మినల్ ను కొనసాగించేందుకు అన్ని విధాలా కృషి జరుగుతోందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ.. ఈ విషయంపై రాష్ట్ర.. కేంద్ర ప్రభుత్వా లతో చర్చిస్తున్నామన్నారు. అఖిల పక్షం నేతలు ఎవరూ మాట్లాడటం లేదన్నారు. కానీ టీడీపీ నేత సోమిరెడ్డి మాత్రం నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారన్నారు. ఆయన నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో సెంబ్ కార్ప్ విషయంలో కూడా ఇదే తరహాలో…
మోడీ పదేళ్ళలో అప్పులను 156 లక్షల కోట్లు అప్పులు పెంచాడన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని అసలు ఉద్యోగాలే ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలను కేంద్రంలోని బీజేపీ భయపెడుతోందని ఆయన ఆరోపించారు. స్ధానిక పార్టీలు కేంద్రంలో బీజేపీతో సిగ్గు లేకుండా రాత్రి పూట కలుస్తున్నారని, ఏపీ నుంచీ పగలు ఒకరు రాత్రి ఒకరు ఢిల్లీ వెళ్ళి కలుస్తున్నారన్నారు రామకృష్ణ. ఎన్టీఆర్ కూడా ఏరోజూ కేంద్రానికి…
తెలంగాణ కెప్టెన్గా ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్! వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్)లో గేల్ ఆడనున్నాడు. ఐవీపీఎల్ మొదటి ఎడిషన్లో తెలంగాణ టైగర్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని గేల్ స్వయంగా చెప్పాడు. వెటరన్ ప్రీమియర్ లీగ్తో మీ ముందుకు రాబోతున్నా, ఐవీపీఎల్ కోసం అందరూ సిద్దంగా ఉండండి అని యూనివర్సల్ బాస్ పేర్కొన్నాడు.…
ఏపీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఆయా పార్టీ అధినేతలు ఢిల్లీ పర్యటనలతో ఏపీ రాజకీయాలు హస్తినకు చేరుకున్నట్లైంది. అయితే.. బీజేపీతో చంద్రబాబు చర్చలపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో చంద్రబాబు అర్థరాత్రి చర్చల కారణమేంటి ? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపితే మంచిదేనని, 2014లో బీజేపీ రాష్ట్రానికి అవసరం అన్నారు చంద్రబాబు అని ఆయన అన్నారు. 2019 వరకు కలిసి ఉండి చివర్లో మోసం చేసిందని…
షర్మిల పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంత్రి రోజా విశాఖలో మాట్లాడుతూ.. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒక సారి గమనించాలని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కల్పి అన్యాయం చేశారన్నారు. షర్మిల గారికి సలహా ఇస్తున్నానని, ఇప్పుడు తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుండి మనకి రావాల్సిన 6 వేల కోట్లు అని, ఉమ్మడి ఆంధ్ర హయాంలో ఏపీకి…
చిత్తూరు జిల్లా పుంగనూరు లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి, మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో కి వచ్చినప్పుడు 14200 కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయి. నేడు వాటికి వడ్డీలకు వడ్డీలు అయ్యి 25 వేల కోట్లకు చేరిందని, సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై స్పందించారని ఆయన అన్నారు.…