అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ కేసులో చార్జిషీట్ ను ఇవాళ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసింది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ పేర్లను పేర్కొంది. కాగా.. నారా లోకేష్ , లింగమనేని రమేష్, రాజశేఖర్ ప్రధాన నిందితులుగా సీఐడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సింగపూర్ తో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం చేసుకుందని ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్…
కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనుకు ఊరట.. బెయిల్ మంజూరు విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు అతనికి షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదేళ్ల తర్వాత శ్రీనుకు బెయిల్ లభించింది. కాగా.. ఈ కేసుపై మీడియాతో మాట్లాడద్దొని నిందితుడికి న్యాయస్థానం ఆదేశించింది. రూ.25 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మడివరం పోలీస్ స్టేషన్…
చంద్రబాబు, పవన్ పై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ టీడీపీ పార్టీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరలా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. చంద్రబాబు, సోనియాగాంధీ అమిత్ షా.. వంటి వారిని ఎన్నిసార్లు కలిసిన జగన్మోహన్ రెడ్డిని తాకలేరని అన్నారు. గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి…
రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధివిధానాలుండే కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు.…
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అమిత్ షాను కలిశారు.. సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రధానిని కలుస్తున్నారని అన్నారు. పొత్తుల గురించి వెంపర్లాడటం చూస్తే టీడీపీ ఎంత బలహీనంగా ఉందనేది బయటపడుతోందని విమర్శించారు. టీడీపీకి బలముంటే పొత్తుల కోసం ఎవరి వెంట పడాల్సిన అవసరం ఉండదని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీ దగ్గర ఎమ్మెల్యేలు.. సీఎం ని కలిసే వాళ్ళా అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్.. హరీష్ దగ్గరికి పోయే వాళ్ళు అని, మీ ఎమ్మెల్యేలు మా దగ్గరికి వస్తే సీఎం ని కలుస్తారన్నారు. మల్లారెడ్డి కూడా మా దగ్గరకు రావచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన మాట్లాడటం లేదు కదా అని అన్నారు జగ్గారెడ్డి. 20 మంది ఎమ్మెల్యేలు…
విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 206 అడుగుల అంబేద్కర్ మహా శిల్పాన్ని ఏర్పాటు చేయడం ఓ చరిత్ర అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడిన వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. సమసమాజ స్థాపనకు సీఎం జగన్ నడుంబిగించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. దేశంలో బలహీన వర్గాలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ కాదని నిరూపించే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు.…
రామకృష్ణమఠం 50 వసంతాలు పూర్తిచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని బేలూర్ మఠానికి అనుబంధంగా భారతదేశంలో, విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి. భాగ్యనగరంలో 1973లో రామ కృష్ణ మఠం స్థాపించారు. దోమల్‌గూడలో ఉన్న ఈ మఠం 2023 డిసెంబర్లో 50 సంవత్సరాలను పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలను జరుపుకోవడానికి సిద్ధమయింది. స్వర్ణోత్సవాల సందర్భంగా..ఈ నెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. Modi vs Rahul: మోడీ క్యాస్ట్‌పై కేంద్రం క్లారిటీ.. రాహుల్‌కి…
రాష్ట్ర పరిస్థితులపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి వస్తే పవన్ కల్యాణ్ సిద్ధం అని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పరిపాలన ఎంత గొప్పగా ఉందో వాళ్ళు చెబుతారు.. ఎంత చెత్తగా ఉందో మేం చూపిస్తామని చెప్పారు. కాగా.. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడటం 98శాతం ఖాయమని అన్నారు. 2014లో వచ్చిన ఫలితాల కంటే 30శాతం అధికంగా సీట్లు సాధిస్తాం అని ధీమావ్యక్తం చేశారు.
రెండు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడిస్తారని అనుకున్నామన్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్నారు. గవర్నర్ స్థాయి తగ్గించేలా గవర్నర్ స్పీచ్ సిద్ధం చేశారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై, తెలంగాణ అప్పులపై ఎక్కడా స్పీచ్ లో లేదని…