మేము మాట ఇచ్చాము ఆ మాట ప్రకారం నిర్ణయం తీసుకున్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణననీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు.. మేము ఎవరికి వ్యతిరేకం కాదు.. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇవాళ (ఫిబ్రవరి 17న) అసెంబ్లీలో ఈ తీర్మానంపై చర్చ జరగనుంది.
పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల కోసం పోలీసులున్నారని వ్యాఖ్యానించిన హైకోర్టు.. పోలీసు విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా శ్రీకృష్ణ స్థిరాస్తి సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన డబ్బులను ఏసీబీ సీజ్ చేసింది.
నోటి పుండ్లు సాధారణంగా నాలుక, చిగుళ్లు, దవడ లోపల, పెదవుల లోపల ఏర్పడతాయి. ఇవి నొప్పిని కలిగించడంతో పాటు చాలా అసౌకర్యం కల్పిస్తాయి. దీంతో ఆకలి వేసినా తినలేని పరిస్థితి ఉంటుంది. నోటిపుండ్లు ఎలాంటి హాని కలిగించకపోయినా వీటి వల్ల నోటికి కొంచెం కారం, పులుపు తగిలినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోటిలో కురుపులు రావడానికి గల కారణం.. విటమిన్ 'బి' లోపంతో సహా అనేక కారణాలు ఉన్నాయి. అంతే కాకుండా.. కొన్ని ఫుడ్ ఇన్ఫెక్షన్ల వల్ల…
బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు వుంటే మా ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారని మల్లారెడ్డి ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లాలో కోళ్లకు వచ్చిన వ్యాధికి సంబంధించి ఏపీ పశు సంవర్ధక శాఖ ఓ ప్రకటన చేసింది. అక్కడ కోళ్లకు వచ్చిన వ్యాధి ఏవియన్ ఇన్ఫ్లుయాంజగా గుర్తించినట్లు తెలిపింది. భోపాల్‌లో ల్యాబ్ టెస్ట్ కి పంపించిన తర్వాత వ్యాధి నిర్ధారణ జరిగిందని పేర్కొ్న్నారు. కోళ్లు ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి, కడప, అనంతపురం జిల్లాలకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా.. చెరువులు, వలస పక్షులు వచ్చే ఉభయగోదావరి జిల్లాలు, నెల్లూరు, కడప, అనంతపురం ప్రకాశం…
పార్టీ నేతలతో టీడీపీ అధినేతచంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈసారి పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున టిక్కెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని సూచించారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని తెలిపారు. జగన్ తో విసిగిపోయిన చాలా మంది వైసీపీ నేతలు.. రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరుతాం అంటున్నారని చెప్పారు. మంచి వారై ఉండి, పార్టీకి బలోపేతానికి…