తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇవాళ ఇరికేషన్ శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కేసీఆర్ సభకు రావాలని, ప్రాజెక్టులను తొందరగా కట్టాలన్న ఆతృత తప్ప, వాటి నాణ్యత గురించి పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ కూలిపోయిందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయాలను కోడ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు…
తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. అయితే.. తాజాగా తెలంగాణ రవాణా శాఖలో ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ అయ్యేలా రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. అన్ని స్థాయుల్లోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్థానచలనం జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (MVI), 23 మంది రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు(RTO), ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు(DTC) బదిలీ అయ్యారు. Medaram Jatara : మేడారంలో తాత్కాలిక…
తమ డిమాండ్లను ప్రభుత్వం తీర్చులేకపోతుందని ఏపీ జేపీసీ ఆరోపిస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు, IR ఇవ్వకపోడంతో ఏపీ జేపీసీ ఉద్యమ బాట పట్టింది. ఈ క్రమంలో ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతామని జేఏసీ నేతలు చెబుతున్నారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రం సమర్పించింది. శనివారం ఉదయం సభ ప్రారంభం కాగానే నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. మంత్రి తన ప్రసంగంలో మేడిగడ్డ ప్రాజెక్టుపై ఆందోళనలను ఎత్తిచూపారు. ప్రాజెక్టుల పరిస్థితిని వివరించే సంక్షిప్త వీడియోను అసెంబ్లీలో పంచుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో చర్చలు కొనసాగుతున్నాయని, ఎన్డీఎస్ఏ నివేదికను సభకు సమర్పించారని మంత్రి ఉత్తమ్ ఉద్ఘాటించారు.…
మేడారంలో భక్తుల కోసం తాత్కాలిక బస్ స్టేషన్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. 55 ఎకరాల్లో బెస్ క్యాంప్‌తో కూడిన బస్ స్టాండ్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఓకే సారి 30 వేల మంది క్యూ లైన్లో ఉండేలా బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. మేడారం వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి సుధాకర్ ప్రారంభానికి…
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు NAFC యూనిట్ లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు.. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రొద్దుటూరు రాజకీయం హీటెక్కుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మె్ల్యేల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో రూ.40 కోట్ల విలువైన భూమిని ఎమ్మెల్యే రాచమల్లు ఆక్రమించాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఎండోమెంట్ భూమిలో సొంత నిధులతో ఎమ్మెల్యే రాచమల్లు ఎందుకు రోడ్డు వేశాడని దుయ్యబట్టారు.…
శ్రీశైలం దేవస్థాన పరిధిలోని గౌరీ సదనంలో ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 137 రూమ్‌లో వాళ్లు చనిపోయి ఉన్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన మల్లేష్ అనే వ్యక్తి.. ఈనెల 13న రూమ్ తీసుకున్నట్లు ఎంట్రీ బుక్‌లో నమోదు చేశారు. అయితే పక్కన గదిలో ఉన్న యాత్రికులు దుర్గంధం వస్తుందని ఆలయ అధికారులకు చెప్పడంతో ఈ విషయం బయట పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, దేవస్థానం అధికారులు.. సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా…
చిన్న పిల్లలకు పీచు మిఠాయి అంటే చాలా ఇష్టం. చూసేందుకు ఆకర్షణీయంగా, తియ్యగా ఉంటుంది. కేవలం చిన్న పిల్లలకే కాకుండా.. పెద్దవారికి కూడా పీచు మిఠాయి అంటే ఇష్టమే.. పీచు మిఠాయిని ఎక్కువగా బీచ్‌లు, పార్కులు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో విక్రయిస్తారు. అయితే ఒకప్పుడు మన ముందే పీచు మిఠాయిని తయారు చేసి ఒక చిన్నపాటి పుల్లకు చుట్టి ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడున్న కాలంలో కవర్లలో పెట్టి అమ్ముతున్నారు.
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. న్యూయార్క్ కోర్టు జడ్జి ఆర్థర్ అంగోరాన్ ట్రంప్, అతని కంపెనీలను మోసం చేసిన కేసులో సుమారు 355 మిలియన్ డాలర్లు అంటే రూ. 3వేల కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించారు.