ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాల వేగంగా మారుతున్నాయి. పార్టీలో టికెట్ లభించకపోయినా, సమచిత స్థానం కల్పించలేకపోయినా లీడర్లు పార్టీ మారుస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం.. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేసింది. ఈ క్రమంలో పార్టీ నుంచి అలకలు, బుజ్జగింపుల పర్వం మొదలైంది.
కులగణన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ఆయన అసెంబ్లీలో తెలిపారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్–14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మధ్యాహ్నం ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. 27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం.. రేపు సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ను నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.
అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తామని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఈనెల 26వ తేదీన మల్లిఖార్జున ఖర్గే, షర్మిల, మాణిక్యం ఠాగూర్ లతో కలిసి జిల్లాలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని అన్నారు. మరోవైపు రాష్ట్రాన్ని మూడు ప్రాంతీయ పార్టీలు నాశనం చేశాయని దుయ్యబట్టారు. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదాలాంటి అంశాలు తమ మేనిఫెస్టోలో ఉంటాయని తెలిపారు. కాగా.. ఇండియా కూటమితో కలిసి వచ్చే అందరితో మాట్లాడతామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చనిపోయింది అన్న…
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.
8మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5మంది బీఆర్ఎస్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని.. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని ఆయన అన్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీనే వారి అవినీతిపై మాట్లాడారని బండి సంజయ్ పేర్కొన్నారు.
టీడీపీపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనన్న హౌసింగ్ కాలనీ కోసం గతంలో చూసిన భూములు టీడీపీ కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయాయని ఆరోపించారు. పేద ప్రజలకు పట్టాలు ఇవ్వకూడదనే దురుద్దేశ్యంతో టీడీపీ నేతలు కావాలనే మళ్లీ మళ్లీ కోర్టుకు వేయించారని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఒంగోలులో భూములు తీసుకున్నామని.. ఒంగోలులో పట్టాలు ఇవ్వకుంటే పోటీ కూడా చేయనని చెప్పానని బాలినేని తెలిపారు.
బీఆర్ఎస్ మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో పలువురు బీఆర్ఎస్ నేతలు చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.
వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని గాజులరామారంకి చెందిన అభిలాష్, అమరావతి దంపతులకు 2019లో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.4 కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. అర కేజీ బంగారం, 2 కేజీల వెండి వస్తువులు, రూ. 10 లక్షల నగదు, హయత్ నగర్లో రూ. 3 కోట్ల విలువ చేసే ఫ్లాటు కట్నం కింద ఇచ్చారు.
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఛాలెంజ్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పీకుతాను అంటున్నాడని.. తన వెంట్రుక కూడా పీకలేడని ఆరోపించారు. రామకృష్ణ బాబు అవకాశ వాదని దుయ్యబట్టారు. యాదవ సామాజిక వర్గాన్ని తొక్కేసిన వాడు వెలగపూడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగాని అడ్డంగా నరికి చంపి పారిపోయిన వ్యక్తి వెలగపూడి.. అటువంటి రామకృష్ణ బాబు ఇప్పుడు రంగులు మార్చి జనసేన అధినేత ఫోటో పెట్టుకుని కాపుల ముందుకు వెళుతున్నాడని దుయ్యబట్టారు.…