మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఎక్కడ యుద్దం చేస్తారో వారికే తెలియదని సెటైర్లు వేశారు. అసలు కలిసి యుద్ధం చేస్తారో లేదో కూడా పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు కి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాలలో పోటీకి సిద్దమని, జనసేన ఎన్ని చోట్ల యుద్దానికి సిద్దమో పవన్ కళ్యాణ్ కి గాని వారి కార్యకర్తలకు తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్ని చోట్ల యుద్దం చేస్తాడో ఆయనకే తెలియదన్నారు.
Machani Somnath: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యం..
అసలు బీజేపీ వాళ్ళతో కలిసి యుద్దం చేస్తారో లేదో బీజేపీకీ క్లారిటి లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. మూడు పార్టీలు కలిసి ఎన్ని చోట్ల యుద్దం చేస్తారో తెల్చుకుని అప్పుడు సిద్దం బ్యానర్స్ ప్రక్కన యుద్ధం బ్యానర్స్ పెట్టండని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే తొలి ఆరు నెలల్లోనే రోడ్లన్నీ వేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లపై సీఎం జగన్ మేనిఫెస్టోలో కీలక ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలోని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికే తమకు 2 ఏళ్లు పట్టిందని అన్నారు. ఆ తర్వాత కరోనా వచ్చి, పనులు ఆగిపోయాయని నాని వివరించారు.
Music Director Radhan: రథన్ చెన్నైలో ఉండి బతికిపోయాడు..డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు