చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం జన జాతర బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రణాళిక బద్దంగా పని చేస్తోంది ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ అధికారం వస్తుందా అని brs.. బీజేపీ కార్యకర్తలు చులకన చేశారని, ఆ కార్యకర్తలకు కూడా మనమే ఉచిత విద్యుత్.. సిలిండర్ ఇవ్వబోతున్నామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించండన్నారు. బండి సంజయ్ అడ్డగోలుగా ఆరోపణ చేస్తున్నారని, ఖబడ్దార్ సంజయ్ అని ఆయన ధ్వజమెత్తారు. మా పార్టీ నాయకుల పై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని, మా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే తిరగలేరన్నారు. అక్క..చెల్లె అమ్మలపై మాట్లాడం సిగ్గు చేటు అని, ఇదేనా మీ సంస్కారమన్నారు. బీజేపీ నేతల మాటలు.. ప్రజలు గమనించండన్నారు శ్రీధర్ బాబు.
Jio phone: క్వాల్‌కామ్ సహకారంలో జియో 5జీ ఫోన్.. రూ.10,000 లోపే ధర..
అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతలు రంకెలు వేశారన్నారు. గత ప్రభుత్వం దోచుకున్న సంపద వివరాలు ప్రజల ముందు ఉంచామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తామని, పార్టీని మరింత బలోపేతం చేద్దామన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించండన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అపనమ్మకం సృష్టించే పని చేశారన్నారు. కాంగ్రెస్ కే గ్యారెంటీ లేదని తప్పుడు కూతలు కూసిన వల్ల అడ్రస్ గల్లంతు అయ్యిందన్నారు. అధికారం లోకి వచ్చిన రెండో రోజే హామీలు అమలు చేయడం మొదలుపెట్టినమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ లు అమలు చేస్తుంటే.. బీఆర్‌ఎస్.. బీజేపీ ఓర్వలేక పోతున్నారని, బీజేపీ.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ 1300.. ఇప్పుడు ఐదు వందలకే ఇస్తున్నామన్నారు. పేదలకు 200 యూనిట్లు కరెంట్ ఇస్తాం అంటే బీఆర్‌ఎస్ వాళ్ళు కండ్లలో కారం కొట్టుకుంటున్నారని, అధికారం పోయినదనే అసహనం తో ఉంది బీఆర్‌ఎస్ అని ఆమె అన్నారు.
Tapsee Pannu: ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన సొట్ట బుగ్గల సుందరి